Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. శారదామాత కృప తోడ సద్వివేక
భావ సంపత్తి నొందితిఁ బ్రజ్ఞ మెఱయ
మనుజ గణములలోపాలు మాన్పునటుల
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: శ్రీ శృంగేరి శారదాంబ కృపారసం నాపై కురిపించటం వల్ల సద్వివేక భావ సంపదను ఎంతగానో పొందగలిగాను. ప్రజ్ఞాపాటవాలను కలిగియుండి మనుషులోని లోపాలను తొలగించగలిగేలా కర్మసాక్షివైన ఓసూర్యదేవా నన్ను దయతో చూడవయ్య ప్రభూ!

తే.గీ. తప్పుఁ జేయని వారలై తలలఁబైకి
నెత్తుకుని నిల్వ వలయు మీరెత్తులోనఁ
బదిలముగ నడుగులు పడవలయు సుమ్మి
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: అంతా ఎటువంటి తప్పుచేయని వారై తలలు పైకెత్తుకుని నిలబడాలి. అది కూడా ఎంతో ఎత్తులో నిలబడాలి. మీరు వేసే అడుగులు ఎంతోపదిలంగా పడాలి. ఆ స్థితికి అంతా చేరుకునేలా కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! దయావర్షం కురిపించవయ్య స్వామీ !

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262