Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
*
- షణ్ముఖశ్రీ - 8897853339
*
పాత్రలు - పాత్రధారులు

1. నిర్మాత కావాలనుకుంటున్నవాడు : జయరావు
2. స్నేహితుడు, సలహాదారుడు : ఏ. వి.రావు
3. హీరో : నో ఇస్ర్తి
4. హీరోయిన్: నో వస్ర్తి
5. సెనక్కాయలవాడు : పార్కులో
సెనక్కాలయలమ్మేవాడు

ప్రదేశం: పార్కు, సమయం: సాయంకాలం, సన్నివేశం: జయరావు ఓ బెంచీముందు నిల్చొని ఎవరికోసమూ ఎదురుచూస్తుంటాడు
జయరావు: ఈ పార్కులో కొచ్చి అపుడే పదినిముషాలయింది. ఈ ఏ.వీ. రావు ఎంతకూ రాడు. ఇలాగైతే సినిమా తీసినట్టే. చల్లని గాలి వీస్తూ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ ! అడుగో వచ్చేస్తున్నడు.
ఏ.వి.రావు: మన అదృష్టం పండింది. మంచి కథ ఆలోచించాను.
జయ: నీ పేరు మాత్రమే ఏ.వి.రావు గానీ నీ కన్నీవచ్చు. రారా! ఈ బెంచీ పైన కూర్చుని ముచ్చటించుకుందాం.
ఏ.వి: కథా ప్రారంభం ఎట్టిదనినా
జయ: ఏమిటి హరికథ చెబుతున్నావా
ఏ.వి.: కాదు బుర్రకథ, నా బుర్రలో రాత్రంతాతిరిగిన తిరుగులేని కథ
జయ: చెప్పరా బాబూ!
ఏ.వి.: ఈ కథలో హీరో, హీరోయిన్ లు లవ్వాడరు.
జయ: అబ్బా వైరైటీగా ఉందే. మరైతే ఏమాడుతారు?
ఏ.వి.: పెళ్లాడుతారు.
జయ: అలాగైతే సినిమా అయిపోయినట్లే.
ఏ.వి. : అక్కడే ఉంది అసలు ట్విస్టు.
అక్కణ్ణుంచే అసలు కథ మొదలవుతుంది.
జయ : ఆహా! అద్భుతం చెప్పు చెప్పు
ఏ.వి.: హీరో హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కాపురం పెట్టాక హీరోను మరొకతె ప్రేమిస్తుంది. హీరోయిన్‌ను మరొకడు ప్రేమిస్తాడు.

(ఇంకా ఉంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు- ఈ జీవితం ఓ నాటకం- రచన: షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.