Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. క్షమకు మించిన దే యలంకారమవని
లేదు దానితో వెలుగొందురే జనంబు
లట్టి వెలుగును శ్లాఘింతురనఘులంచుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఓర్పును మించిన అలంకారం ఎక్కడాలేదు. ఆ అలంకారంతోనే భూప్రజలంతా ఎంతగానో ప్రకాశిస్తారు. అట్టి క్షమాలంకార భూషితులే గొప్ప పుణ్యాత్ములని అంతా కొనియాడతారన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈలోకానికి ప్రబోధించుము తండ్రీ.

తే.గీ. నమ్మకద్రోహమును మించునఘము లేదు
నమ్మియుం జేరి నవ్వారి నాదుకొనగ
వలెను లేనిచో ఁ బాపంబు బ్రద్ధలగును
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నమ్మకద్రోహాన్ని మించిన పాపం లేదు. మనల్ని నమ్ముకుని మనచెంతకు చేరినవారిని ఎంతోగానో యాతనలు పడాల్సి వస్తుందన్న సత్యాన్ని కర్మ సాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించుము స్వామీ.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262