Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. సంస్కరించుకుఁ దిరుగాడ సత్ఫలితము
లెన్నియోఁ గల్గు సందేహమేల? యటులఁ
గాని పక్షానఁ జెడిపోదురే! నిజమ్ము
చూడుమో కర్మసాక్షి!యోసూర్యదేవ!

భావం: అంతా తమను తాము చక్కగా సంస్కరించుకుని మసలుకుంటుంటే భవిష్యత్తులో సత్ఫలితాలెన్నో కలుగుతాయన్నది వాస్తవం. ఇందులో సందేహించవలసిన పనిలేదు. వ్యక్తి సంస్కారం జరగకుంటే మాత్రం ఎంతగానో చెడిపోతారన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈ జగతికి ప్రబోధించుము స్వామి.
తే.గీ. కలతఁజెందంగ రాదెన్ని కష్టతతులు
వచ్చి మీదపడినఁ గాని;బలము మదికిఁ
గూర్చి యుంబెట్టకున్నచో ఁ గోలుకోరు
చూడుమ కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఎన్ని కష్టాలు వచ్చిమీద పడినా ఏ మాత్రం కలత చెందకూడదు. మనోబలాన్ని అమితంగా కలిగియుండాలి. మనస్సుకు బలాన్ని కూర్చి పెట్టని పక్షంలో జీవితంలో ఎన్నడూ కోలుకోరన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ జగతికిప్రబోధించుము తండ్రీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262