Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కళలు దేశాభుయదయమును ఁ గాంచవలయు
నపుడు దాటికి స్థారకమబ్ము ఁ గాద
సార్ధకత లేని యవియేల? శంకయేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కళలు దేశాభ్యుదయానికి ఎంతగానో దోహదపడాలి. అప్పుడే ఆ కళలకు సార్థకత చేకూరుతుంది. సార్థకత ఏర్పడనపుడు ఆ కళలు నిష్ప్రయోజనములే అనడంలో అనుమానం లేదన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి విశదీకరించుమయ్యా విభావసా! (సూర్యుడా)

తే.గీ. దూరదృష్టితో ఁ బయనింపఁ దొలగు భయము
లవియు నా దృష్టి కొరవడ నంతఁ గలచి
వేయు జీవితముల ఁగూల్చి వేయు సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!

భావం: దూరదృష్టితో మన పయనం సాగిస్తున్నపుడు భయాలన్నీ తొలగిపోతాయి. ఆ దూరదృష్టి సరిగా లేకుంటే ఆభయాలే జీవితాలను ఎంతగానో కలిచివేస్తూ చివరికి కూల్చిపారేస్తాయన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించుము పద్మబంధువా! (సూర్యుడు)

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262