Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్ళిపెద్దలం
*
-షణ్ముఖశ్రీ-
*
విఘ్నేశ్వరుని విడాకులు
పాత్రలు
1. విఘ్నేశ్వరం : ప్లీడరు
2. మీనా: క్లయింటు

ఉదయం 11 గంటల సమయం. ఆదివారం అయినందువల్ల ప్లీడరు విఘ్నేశ్వరం తన ఆఫీసు రూములోనే ఉన్నాడు. క్లయింటు ఎవరు రానందున నిద్రపట్టి గుఱక పెడ్తున్నాడు. గుఱక బాగా వినిపిస్తూ ఉంటుంది.
మీనా ప్రవేశించింది
మీనా: ఏమండోయ్ ! విఘ్నేశ్వరం గారూ నమస్కారం మిమ్మల్నే పగలు కూడా ఈ గుఱక లేమిటండీ!
గుఱక స్థాయి ఎక్కువైంది.
మీనా: (పొడి దగ్గు దగ్గింది.) (కొంచెం పెద్దగా దగ్గింది)
విఘ్నేశ్వరం గారూ! వెళ్లి మళ్లీ రమ్మంటారా!లేకపోతే మరో ప్లీడర్ ఆరి దగ్గరికి వెళ్లమంటారా!(గుఱక ఆగింది)
విఘ్నేశ్వరం : ఆ! ఆ! లేస్తున్నా ఆ పని మాత్రం చేయకమ్మా. వెధవ గుఱక మ రో ఆదివారం పెడ్తాను.
మీనా: సారీ! డిస్ట్రబ్ చేశాను. నేను మళ్లీ అర్జెంటుగా మరో వైపువెళ్లాలి అందుకని...
విఘ్నేశ్వరం: ఫరవాలేదు. పదిగంటల కల్లా భోంచేసి కోర్టుకెళ్లి బార్ రూమ్‌లో కునుకు తీయటం అలవాటై పోయింది. అంతే.. అంతే...
మీనా: మీరెంతో అదృష్టవంతులు. స్లీపింగ్ పిల్సుతో పని లేకుండా హాయిగా వుంటున్నారు.
విఘ్నేశ్వరం: ఆ !ఏదో ఉంటున్నాను. ఇంతకూ ఏం మాట్లాడాలని వచ్చారు.
మీ: మీదగ్గర కొస్తేనే విడాకుల కేసని అర్థంకదా.
వి: నిజమే మరి! ఒకప్పుడు వియ్యాల విఘ్నేశ్వరం గా ఉండేవాణ్ణి. ఎక్కువగా పెళ్లి సంబంధాల కోసమే జనం వచ్చేవాళ్లు. విడాకుల విఘ్నేవ్వరంగా పేరు మార్చుకున్నాక కాస్త కేసులంటూ కదిలాయ్.
మీన: పేరు మార్చుకోమని ఏ జ్యోతిష్కుడు సలహా ఇచ్చాడు
విఘ్నే: నా మిసెస్ జ్యో. చదువూ చట్టుబండలు లేని చందమామ నా జ్తో. ఆడేస్‌లోనే మాది లవ్ మ్యారేజ్
మీన్ : అందంగా ఉంటారని చేసుకున్నారు అవునా!
విఘ్నే: ఆ ! ఏదో లెండి. ఆ డేస్ వేరు ఆ లవ్‌లు వేరు.
మీన: ఆ అవునవును. అప్పుడు బాల్య వివాహాలు కదా.
విఘ్నే: దానికెనిమిదేళ్లు.. నాకు పద్నాల్గు ఏళ్లు
మీన: సంతానం
విఘ్నే: వేరే అడగలా! ఏడుగురు ఆడ నలుగురు మగ. ఇద్దరికి మాత్రం పెళ్లిళ్లు అయ్యాయి. తతిమ్మా వాళ్లంతా మెల్లమెల్లగా ముప్పయో పడిలో పడుతున్నారు.
మీన: అందుకే దేనికైనా ప్లానింగ్ కావాలి ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్
విఘ్నే: అలాంటివన్నీ అప్పుడు లేవు మరి..
మీన; ఇంతకూ మీ శ్రీమతి గరా ముచ్చట చెప్పనే లేదూ
విఘ్నే: ఆ ! ఆ! చెప్తాను. ఒకనాటి రాత్రి నాకు తమలపాకులు అందిస్తూ తనకు విడాకులు కావాలని కోరింది. వెంటనే నా తల తిరిగిపోయింది.
మీన: విడాకులిచ్చేశారా
విఘ్నే: లేదు. ఇప్పుడెందుకవు మనకు అనడిగాను. మన పక్కింటి జానకమ్మ కూతురికి వాళ్ల అల్లుడు విడాకులిచ్చి ఆ పిల్లను ఇక్కడే ఉంచి వెళ్లాట్ట. అవి ఎలా ఉంటాయో చూద్దామని మిమ్మల్ని కూడా తెమ్మన్నానండీ అంది. భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చినపుడు కోర్టు ద్వారా విడిపోయేందుకు చేసిన ఏర్పాటే విడాకులని వివరించాను. అపుడు నాజ్యోతి బుర్రలో మరో ఆలోచన మెదిలి, విడాకుల విఘ్నేశ్వరంగా నా పేరు మార్చమన్నది. కనీసం ఆ విడాకుల కేసులన్న వస్తయ్యని అని అదీ సంగతి

(ఇంకాఉంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు- ఈ జీవితం ఓ నాటకం- రచన:షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.

- సంగనభట్ల రామకిష్టయ్య