Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. పుల్లవిరుపు మాటల తోడ యుల్లములకు
గాయములు సేయువారలే ! మాయరోగ
మదియు ఘోరవౌ నరకంబునందుఁ ద్రోయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈనాటి సమాజంలో పుల్లవిరుపు మాటలతో మనసులను గాయపరిచే వారెందరో ఉన్నారు. అదో పెద్ద మాయరోగం. ఆ మాయరోగం అటువంటి వారిని భయంకరమైన నరకకూపంలోనికి త్రోసి పారేస్తుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించుము స్వామి.
తే.గీ. చెల్లెలా! బాధపడకమ్మ శీఘ్రగతిన
మారిపోయెడి రోజులామనిని ఁ ద్రెచ్చు
నపుడు పై చేయి నీ దగునమ్మ సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: చెల్లెలా! బాధపడకమ్మ! అత్యంత వేగవంతంగా మారిపోయే మంచిరోజులు వచ్చేస్తున్నాయి. ఆ రోజులు వస్తూ వస్తూ ఆమనిని వెంటబెట్టుకుని మరీ వస్తాయి. అప్పుడు నీదే పై చేయి అవుతుందమ్మా. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నాచెల్లెలికి సకల శుభాలను చేకూర్చుస్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262