Others

జటధారి! దయాఝరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం. శ్రీకాళహస్తిదేవా
ఆకాశీ విశ్వనాథ ! హరమల్లేశా
రాకాశశాంక భూషణ!
లోకైక సురక్ష! భక్తలోలా! భోళా!

మ. చలువౌ కొండనివాసమై ప్రమథులున్ సర్వామరుల్ గొల్పగా
కొలువున్ దీర్చి యశేష లోకముల సంక్షోభాగ్నులన్ బాపినీ
చలువన్ పూజలనందు శంకర! హరా! శంభో! విభో! సుందరా!
చిలువన్ హారముగా ధరిచిన శివా! శ్రీ చంద్ర వౌళీశ్వరా!

శా. క్షీరాబ్ధిన్ సురరాక్షసుల్ చిలుక, అక్షీణాగ్నికీలోగ్రతన్
ఘోరంబై ప్రసరించు హాలహలమున్ కోపించి దానంతటిన్
నేరేడట్లుగా చేసి మ్రింగుచును పత్నీరత్నమే కోరగా
మారేడాకుల కోరుసామి! గళమున్ మాడ్చావు శ్రీకంఠుడై

మ. గిరిజామాతకు అర్థదేహమిడి అంగీకార యోగ్యయిగా
గిరి జామాతగా పేరుపొందితివి యోగిస్థానమే భోగిగా
అరుణంబౌసతిరంగులోమురిసే శే్వతాంగంబు ఎర్రెర్రనై
ధరలో స్ర్తిబలమెంతయో తెలిసె మీ దాంపత్య ధర్మంబునన్
మ. పగలంతా శివ! నీ మహత్వ గుణ సంపత్ శ్లోక పాఠాలు భ
క్తిగ, రాత్రంతయు నీ పురాణకథలున్ దీక్షన్ పఠింపన్ ముదం
బుగ పండ్లే తిను చున్నచో స్థిరముల్ మోక్షంబు కైలాసపున్
నగవాసంబును మమ్మటుల్ నడుపు మో నాగేంద్ర హరా! హరా!

మ. గజచర్మాంబర! పార్థివేశ్వర! మహాకాళేశ్వరా! నిర్మలాం
గ -జటాధారి ! దయాఝరీ! గగన గగాంధారి ! దైత్యారి ! అం
గజ గర్వాంతక భక్త పోషక ! జగత్కళ్యాణ సందీపకా!
ప్రజలన్ చల్లగ కావుమయ్య శుభ సంపత్కాంతులన్ శాంతులన్

- కె. మధుసూదన రావు.. 903090719