Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ మనసు పెడదారిఁ బట్టించు మాట వినదు
లేనిపోనట్టి భ్రమలు గల్పించునదియు
నట్టి మనసును సన్మార్గమందుఁ బెట్టఁ
గీర్తికైవసమగును నీకెదురులేదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: మన మనస్సు మనల్ని పెడదారి పట్టిస్తుంటుంది. అస్సలుకే మన మాట వినదు. లేనిపోని భ్రమలు కల్పిస్తుంటుంది. అలాంటి మనసును సన్మార్గంలో పెడితే ఎదురనేదే లేదు సరికదా! కీర్తి కైవసమవుతుందన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!

తే.గీ ధనము వచ్చును పోవును జనము రారు
జనమునొందంగ వలెనన్న సచ్చరిత్ర
యుండగావలె వ్యక్తిత్వముండవలెను
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ధనం వస్తుంది, పోతుంది. జనం రావాలంటే రారు. జనబలాన్ని పొందాలంటే సచ్చరిత్రను, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కల్గియుండాలనే సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262