Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే॥ కుత్సితత్త్వంబు వీడక (గొలదియైన
సుగుణముల (గల్గియుండకఁజూడ సూక్తు
లమితముగ వచియించెడి యల్పజనులు
తారసిల్లని నాడెగా భరణి మెఱయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఏ మాత్రం కుత్సితబుద్ధిని విడిచిపెట్టకుండా, ఒక్క సుగుణాన్ని కూడా కలిగియుండకుండా ఎనె్నన్నో సూక్తులను వల్లించే అల్పులు కనబడని నాడే ఈ భూమి ఎంతగానో ప్రకాశిస్తుందన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!
తే॥ తన్నుఁదానెరిగిననాడె తనకు దొరకు
నెన్నియో జ్ఞానపుష్పాలు సుమ్మి కనగ
నవియు నర్పించవలయు నీయవతితల్లి
కటులఁగాకున్నఁబుట్టువుకర్థమేది?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: తనను తాను తెలుసుకున్ననాడే ఎనె్నన్నో జ్ఞానపుష్పాలు లభిస్తాయి. అవనితల్లికా ఆ జ్ఞాన పుష్పాలనర్పించి కొలవాలి. అలా కాని పక్షంలో ఉదాత్తమైన ఈ మానవ జన్మకు అర్థమే ఉండదన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు తండ్రీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262