Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. నిత్య చైతన్య దీప్తితో నిలచియడుగు
ముందునకు వేయఁదిరుగు లేదెందు మనకు
బద్ధకించినచోఁగార్య ఫలముసున్న
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మనమంతానిత్యచైతన్యంతో ఆచితూచి అడుగు ముందుకు వేస్తే ఏ విషయంలోనైనా తిరుగులేని విజయం మన స్వంతం అవుతుంది.బద్ధకించిన పక్షంలో చేపట్టిన కార్యాలకు ఫలితం శూన్యం అనడంలో సందేహం లేదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించుము స్వామీ.

తే.గీ. తనను సరిదిద్దుకునిఁ దానుఁ దనను గూర్చి
మిగులఁ దర్కించుకున్నచో మేలు గలుగు
నటులఁ గాకున్న బ్రతుకు చీకటిమయంబు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: తనను తాను సరిదిద్దుకుని తనను తాను తర్కించుకుంటూ ముందుకు సాగిపోతుంటే మేలుకలుగుతుంది. అలా కాకుండా ముందుకుపోతుంటే బ్రతుకంతా చీకటిమయం అవుతుందని కర్మసాక్షివైన ఓసూర్యదేవా నీవు ఈ లోకానికి ప్రబోధించు దివాకరా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262