Others

గీత... వ్యక్తిత్వ వికాస పాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

18 అధ్యాయములతో 700 శ్లోకములతో బాధాతప్త హృదయుడై విరక్తి చెందిన అర్జునుడికి కర్తవ్యాన్ని తెలియజేయుటకు భగవంతుడు చేసిన జ్ఞానోపదేశమే భగవద్గీత
గీతాపారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతాపఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించారు. ఇలా వివరించారు. ‘‘మహా పాపాది ....దళ మంభసా!’’ నియమంతో నిర్మలమైన మనస్సుతో గీతా పారాయణము చేయుటవలన అనేక మహాపాపములు నశించి ఉత్తమ ఫలితాలు కలిగి ఉత్తమ గతిని పొందుతారు. శ్లోకాల రూపంలో ఉన్నా దానినంతా ఎంతోమంది సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు వచనరూపంలోను, వ్యాఖ్యాన రూపంలో వెలువరించి ఉన్నారు. అసలు విశ్వమానవ కళ్యాణం కొరకు సమస్త ప్రాణకోటికి శ్రీకృష్ణ్భగవానుడు ఉపదేశించిన తత్త్వామృతమే భగవద్గీత. గీతలో ఏ ఒక్క శ్లోకం అర్థం చేసుకొని ఆచరించినట్లయతే ఇహపరాల్లో సుఖసంతోషాలు కలుగుతాయ.
1.మొదటి అధ్యాయం ‘అర్జున విషాదయోగం’ పారాయణము మానవునికి పూర్వజన్మ స్మృతి కలిగిస్తుంది. 2.సాంఖ్యయోగ పారాయణం ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది. 3.కర్మయోగ పారాయణంచే ఆత్మహత్య, బలవన్మరణాల మృతి నొంది ప్రేతత్వం పోని జీవులు పరిసరాలో ఉంటే వాటి ప్రేతతత్వం నశిస్తుంది. 4,5.జ్ఞానయోగం, కర్మ సన్యాసయోగం వినుటవలన పశుపక్షుల పాపం నశించి ఉత్తమ గతిని పొందుతాయి. 6.ఆత్మసంయమనయోగం పారాయణం సమస్త దానాల ఫలితం కలిగించి భగవద్‌సన్నిధిని చేర్చుతుంది. 7.విజ్ఞానయోగం పారాయణంవలన జన్మరాహిత్యం కలుగుతుంది. 8.అక్షర పరబ్రహ్మయోగం స్థావరత్వం, బ్రహ్మరాక్షసత్వం దూరవౌతాయి. 9.రాజవిద్యా రాజగుహ్యయోగం పారాయణవలన పరులనుండి ఏదైనా గ్రహిస్తే వారినుండి సంక్రమించే పాపం నశిస్తుంది. 10.విభూతి యోగం పఠనమువలన ఆశ్రమ ధర్మాల సక్రమ నిర్వహణ వల్ల లభించే పుణ్యం కల్గుతుంది. 11.విశ్వరూప సందర్శన యోగంవలన మృతులు కూడా పునర్జువులౌతారు. 12.్భక్తియోగం పారాయణమువలన ఇష్టదేవతా సాక్షాత్కారం లభిస్తుంది. 13.క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పారాయణమువలన చండాలత్వం దూరవౌతుంది. 14.గుణత్రయ విభాగయోగ పఠనమువలన స్ర్తిహత్యా పాతకము, వ్యభిచార దోషం నశించును. 15.పురుషోత్తమ ప్రాప్తియోగం. ఈ అధ్యయ పారాయణమువలన ఆహారశుద్ధి కలుగుతుంది. కావున భోజనానికి ముందు ఇది పారాయణం చేయాలి. 16.దైవాసుర సంపద్విభాగ యోగము పారాయణమువలన అధైర్యము నశించి ధైర్యము కలిగి సుఖశాంతులు లభిస్తాయి. 17.శ్రద్ధాత్రయ విభాగయోగం పారాయణమువలన సమస్త భయంకర రోగాలు దూరమై స్వస్థత చేకూరుతుంది. 18.మోక్షసన్న్యాస విభాగయోగం పఠనమువలన సమస్త యాగాచరణ ఫలితం కలుగుతుంది. సకలారిష్టాలు తొలగి సుఖం లభించి మోక్షప్రాప్తి కలుగుతుంది.కనుక అందరూ చదువవలసింది భగవద్గీత.
చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ గీతను కంఠోపాఠం చేయాలి. వారు పెరిగి పెద్దవారయనా వారి వ్యక్తిత్వ వికాసానికి, వారి బుద్ధివికాసానికీ ఈ గీత ఎంతో మేలు చేస్తుంది. ముందుగా వారిని మనుష్యులు తీర్చిదిద్దుతుంది. మానవత్వం మూర్త్భీవించేట్టుగా చేస్తుంది. గనుక వయస్సు తారతమ్యాన్ని చూడకుండా ప్రతిఒక్కరూ గీతాభ్యాసం చేయాలి.

- మాగంటి రాధిక