Others

పంచీకరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచీకరణి యనగా ఐదు విధములు. ఏమిటి రుూ ఐదు విధములు అనగా సూక్ష్మధారియై వున్న అధిష్టాన చేతన బ్రహ్మము స్థూలముగా పంచ భౌతిక రూపమైన సృష్టియందు పంచభూతములతో కూడి ఎనుబది నాలుగు లక్షల జీవనోపాదులకు ఆలంబనగా నిలిచియున్నదన్న విషయాన్నివేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, మరియు అనుభవ వేదాంత యోగులు మనకు నిత్యం అందిస్తూనే వున్నారు. ఈ ఐదు భూతములు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధ్వి-వీటియొక్క సమిష్టి రూపమే సృష్టి. ఒక్కొక్క భూతము ఐదు ఇంద్రియాలతో గూడి వాటి ప్రేరణతో ఉపాధుల యొక్క వ్యవహారశైలిని నడిపిస్తూ వుంది. సృష్టిలోని సమిష్టి ప్రేరణ వల్ల నియమబద్ధంగా ఈ ప్రపంచం కదులుతూ వుంది. అలాగే ఒక ప్రాణియందు కూడా అదే నిబద్ధత కలిగివుంది. ఎందుకనగా సృష్టిలోని సూక్ష్మ లక్షణాలే ప్రతి అంశమందు నిర్మితమై యున్నందున క్రమయుతంగా జరగడానికి అవకాశమున్నది.
దృశ్యమానమైన ఈ సృష్టిని బాహ్యంగా గమనిస్తే రెండు విధాలుగా గోచరిస్తుంది. స్థావరములు, జంగమములు అని నిర్థారించవచ్చును. స్థావరములనగా కదలకుండా వుండబడినవి. జంగములనగా కదిలే ప్రాణులు. ఈ రెంటికి ఎడతెగని అవినాభావ సంబంధం కలిగి యున్నందున సజావుగా సాగిపోతుందని. జడపదార్థ రూపములైన పృధ్వి, చెట్టు, గుట్ట, ఆహార మిత్యాదివన్నియును స్థావరములే. జంగమరూప ప్రాణులు ఎనుబది నాలుగు లక్షల జీవోపాదులని శాస్త్ర ప్రమాణం.
ఈ పంచభూతములు పరిణామక్రమంలో ఒక్కొక్క భూతము ఐదు ఇంద్రియాలుగా ఐదు కలిసి 25 ఇంద్రియాలుగా పరిణమించింది.ఈ విధానానే్న పంచవింశతి విధానంగా చెప్పబడింది.
1.ఆకాశతత్వం యొక్క ఇంద్రియాలు జ్ఞానం, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను అంతరేంద్రియములు. 2.వాయువు యొక్క ఇంద్రియాలు వ్యానము, ప్యాణము, ఉదానము, సమానము, అపానము అనునవి ప్రాణేంద్రియాలుగా, 3.అగ్నియొక్క ఇంద్రియాలు ఘ్రాణము, శుక్రత్వము, త్వక్కు, చక్షువు, జిహ్వ యను జ్ఞానేంద్రియాలు. 4.జలము యొక్క ఇంద్రియాలు, రసము, గంధము, రూపము, స్పర్శము, శబ్దమను విషయేంద్రియాలు. 5.పృథ్వియొక్క ఇంద్రియాలు వాక్కు, పాణి, పాదము, గుదము, గుహ్యమను కర్మేంద్రియాలుగా ఈ యిరువైదైదు ఇంద్రియ సమష్టి రూపమే దేహముగా పిలువబడుచున్నది. అందులకై ఈ ఉపాధి అత్యున్నతమైనదిగా, ఉత్కృష్ట జన్మగా భావించబడినది.
సృష్టిలో అన్ని జీవులకు ఒక నియమ బద్ధ ధర్మమును కలిగియున్నను, కేవలం విచారించునది, మాట్లాడునది, తెలుసుకోగలిగగినది ఈ ప్రాణియే కావున అన్ని జన్మలకంటెను ఉన్నతమైనదిగా శాస్తమ్రులు వక్కాణించుచున్నవి.
ఇట్టి జన్మను వృధాకానివ్వక సద్విచార ప్రవర్తనులై సద్గురువుల నాశ్రయించి గురుశుశ్రూష విధానాన్ని ఆచరించి జన్మహేతువుకు గల విశిష్టమైన విషయాన్ని శాస్త్ర దృష్టిచే గురువుల చెంత చేరి విచారిస్తూ, స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొని జాగరూకుడై ఈ ప్రపంచమందు ధర్మాధర్మవిచక్షణ కలిగి స్థితప్రజ్ఞుడిగా జీవిస్తూ, ఇతరుల యెడ ప్రేమభావంతో అజ్ఞానంలో వున్నవారిని తరింపజేయు మార్గం వైపు ప్రేరేపింపజేసి కృతార్థులను జేస్తూ కృతార్థులవుతారని ఆశిస్తాము. *