Others

అన్నింటికీ సిద్ధం సుమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగలూ రేరుూ
తీరిక లేక నడిచే మరయంత్రం
నోరున్నా మాట్లాడలేను
గాయాలన్నీ కళ్లల్లో నిక్షిప్తం
అలసి సొలసిన మేను
బాధలని మనసుకి చేరనీయక
కలల కళారూపాలు కళ్లల్లో నింపుకుంటాను
ఇల్లు దాటని కాళ్లూ
బాహ్య ప్రపంచం కాంచని కళ్లు
దించిన తలలో మేధో మధనం
మనిషిరూపంలోని
మాంసం ముద్దలనే
చూడగలిగిన కళ్లల్లోకి తెలిసిన అస్త్రాలన్నీ
సంధించాలని
కనుబొమ్మలెగరేసి ధైర్యం కోసం
నడుస్తున్న దారిలో కళ్లల్లో బడబాగ్ని ప్రజ్వరిల్లే
చైతన్య బీజాల హారం మెడలో ధరించాలని
నా బిడ్డల
పుట్టుపూర్వోత్తరాల పరీక్షలో
ఎన్ని శస్తచ్రికిత్సలో
జన్యుసంబంధ పరీక్షలకు సిద్ధం
వేలయేళ్ల వెనుకకైనా

- గిరిప్రసాద్ చెలమల్లు 9493388201