Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. తీవెలకుఁ బూవులందమ్ము దెచ్చునటులఁ
బలుకులందమ్ము నొనగూర్చు బహువిధాల
మానవాళికి సంశయమ్మనవసరము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: లతలకు పువ్వులు అందాన్ని తెచ్చి పెడతాయి. అలాగే మానవులకు పలుకులే అనేక విధాలుగా అందాన్ని తెచ్చి పెడతాయి. ఇందులో ఎలాంటి సంశయం లేదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించుస్వామీ.

తే.గీ. మద్యపానమ్ము నంబడి మత్తులోనఁ
దూలి పోవుచు నాశమ్మునేలఁ గోరు
కుందురజ్ఞాన తిమిరానఁ గూలుటేలఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మద్యపానంలో పడి మత్తులో తూలిపోతూ నాశనాన్ని కోరుకుంటారెందుకో గదా. అజ్ఞానమనే చీకటిలో పడిప్రాణాలు కోల్పోకూడదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియజెప్పుమా స్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262