Others

సర్వమూ వాసుదేవమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లయందును దావసియించుటెల్ల
యదియు దనయందువసియంచుటండ్రు వాసు
దేవుడను పేరికర్థంబు దెల్లమంత
యెఱుగు జనులందు దగవసియించు శుభము
అంటూ మహాభారతంలోని ఉద్యోగపర్వంలో తిక్కన కవి వాసుదేవ ప్రభావం గురించిచెప్పారు. వాసుదేవుని అనుకోని వారు ఉండరు. మహాభారతమైనా, మహాభాగవతం చదివిన వారైనా, అసలు ఏమీ చదవని రానివారైనా సరే వాసుదేవా అనే నామాన్ని పలుకని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అటువంటి వాసుదేవుని గూర్చి - వసుదేవుని కుమారుడు వాసుదేవుడు. పురాణ సంబందం, తత్త్వ సంబంధం. వస్ అనే దాతువు ఉండడం అని అర్థం ఇస్తుంది. దాని నుంచి ఏర్పడిన రూపమే వాసు. దివ్ అనే ధాతువుకు ఆనందించడం అనే అర్థముంది. దానినుంచే పుట్టినదే దేవుడు అనే రూపం. వాసువైన దేవుడు వాసుదేవుడు అంటే క్రీడించేవాడు, ఆనందించేవాడు అనేవి అర్థాలు. ఇక వాసుదేవుని గురించి వేరుగా చెప్పేది ఏముంది?
తాను అన్నింటిలోనూ, అందరిలోనూ ఉంటాడు. తనలోనే అన్నింటినీ అందరినీ కల్గి ఉంటాడు అని చెప్పడానికి సులభమైన పదం వాసుదేవ పదం.
సృష్టిలో వాసుదేవమయమ్ ఈ నామస్ఫూర్తి నిరంతరం మానవుల హృదయాలలో ఉంటే విశ్వం వేరుగా కన్పడదు. ఆస్ఫూర్తిలేకపోతే దానిని ప్రపంచంలాగా చూస్తారు. వాసుదేవుడంటే పరమాత్మ. జగద్గురువు శ్రీకృష్ణుడే. వాసుదేవుని గూర్చి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులూ అన్నీ మనోహరంగా వర్ణించాయి.
వాసుదేవుడు- అందరి భక్తులలో కొలువై, నెలవై విలసిల్లేవాడు. ప్రహ్లాదునిలో వాసుదేవ పదం నిండుగా పరిఢవిల్లింది. శుభం అనగా అజ్ఞానం తొలిగి, జ్ఞానం స్థిరంగా నిలువడడమే. అదే వాసుదేవ భావం.మానవ జన్మకు చక్కని సరియైన స త్ఫలం. వాసుదేవుని వైభవాన్ని భీష్ముడు ప్రస్తుతించిన తీరు లోకోత్తరం.
అరణినగ్ని వొడము కరణిదేవకియందు
విప్రకర్మయజ్ఞ వేదగుప్తి
కై జనించె నెవ్వడవ్వసుదేవనం
దను భజింతు నేకతానురూఢి! యని స్తుతించారు.
గీతలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరిని ప్రవచించడం జరిగింది. ఇరువది నాలుగు కేశవనామాల్లో వాసుదేవ నామం ప్రసిద్ధియైనది. వ్యాసుని మాటను బట్టి భగవంతుడు వాసుదేవాది మూర్తులతో చుతర్విధ వ్యూహాలను పొంది, సృష్ట్యాది కార్యాలను నిర్వహిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణ కారణుడని బ్రహ్మ సంహిత తెల్పినది. విష్ణు సహస్రనామాల్లో వాసనాత్ వాసుదేవశ్చ వాసితం త్ జగత్త్రయం సర్వ భూతనివాసోసి - వాసుదేవ నమోస్తుతే అని వర్ణించారు. శ్రీమన్నారాయణుడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా అవతరించాడని హరివంశం కృష్ణ ధర్మం సనాతనం అని వర్ణిస్తూ సనాతన ధర్మస్వరూపుడు వాసుదేవుడన్నది. యోనందః పరమానందో యశోదాముక్తగేహినీ అని అధ్వర్వణ వేదం అన్నీ మంత్రాల్లోకెల్లా వాసుదేవమంత్రం అత్యంత విశిష్టమైనదని అని అన్నమయ్య కీర్తనలో వర్ణించారు. పరబ్రహ్మ శ్రీకృష్ణుడనీ, మోక్షలక్ష్మియే యశోదనీ పరమానందమే నందుడనీ ఉపనిషద్వాక్యం. కలిజనులు సకలంలో వాసుదేవుని దర్శిస్తూ స్మరిస్తూ తరించాలి. ధన్యులు కావాలి.

- పి.వి. సీతారామ మూర్తి, 9490386015