Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మన ప్రవర్తనతో వంశమందువెల్గు
విస్తరించంగ వలెనంత వింతగొల్పఁ
గడిగినట్టి ముత్యంబులై యడర వలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మన ప్రవర్తనతో వంశంలో వెలుగులు విస్తరించాలి. ఎంతో ఆశ్చర్యజనకంగా. అంతేకాదు మనం కడిగిన ముత్యాలమై స్వచ్ఛతను సంతరించుకుని చక్కగా వర్థిల్లాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు తండ్రీ!

తే.గీ. సంఘమునకీవు కవచమై సత్ప్రవర్త
నమ్ము సచ్ఛీల సంపత్తి నమితముగనుఁ
గూడఁ గట్టుకు తిరుగాడఁ గొల్తురవనిఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: సమాజాన్ని సంరక్షించడానికి నువ్వు ఒక కవచం కావాలి. సత్ప్రవర్తను, సచ్ఛీల సంపత్తిని కూడగట్టుకుని మసులుకుంటుంటే సామాజికులంతా నిన్ను దైవంగా కొలుస్తారు. ఈ విషయాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి బోధించుము తండ్రీ !

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262