Others

సంక్రాంతి మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నింగి తారలు రంగవల్లులై
ముంగిలి ముద్దాడినట్లు
భోగి మంటల భోగభాగ్యాలు
జీవితాల వెలిగించినట్లు

పసుపు కుంకుమల గొబ్బిళ్లు
సిరిదేవి ని ఆహ్వానించినట్లు
రైతు స్వేదం పంట రాశులై
గాదెల ఒడిలో ఒదిగినట్లు

హేమంత మేఘం కరిగి
పూల వాన కురిసినట్లు

సంక్రాంతి పర్వదిన మేళ
ఊరంతా ఉత్సవ మేళా
మనసంతా అమృత జల

పిల్లాపాపల కేరింతలు
ఆడపడచుల భక్తిపూజలు
పిండివంటల నోరూరింపులు
బంధుమిత్రుల పలకరింపులు
బావా మరదళ్ల సయ్యాటలు
వినోదాలు .. ఉల్లాసాలూ

ఇల్లిల్లు సరదాల పందిళ్లు
ఎద ఎదలో సంతసాల సవ్వళ్లు

గంగిరెద్దుల ఆటపాటలు
హరిదాసు భజన సంకీర్తనలు
బసవన్నల సన్నాయి మేళాలు
కోళ్ల పందాల పౌరుస హాసాలు
గాలి పటాల గగన విహారాలు
కోలాటాలు కొత్తపాటలూ

అంబరానంటే సంబరాలు
మకర సంక్రాంతి పర్వదినం
మనమంతా కలసిమెలసి
ఆనందింద్దాం
తెలుగుసంస్కృతుల
ప్రాశస్త్యాన్ని
నలుదిశలా చాటుదాం

- కోడిగూటి తిరుపతి 9573929493