Others

అంతరార్థం ఇదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చే విత్తు ఉన్
పొత్తామరై యడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్
తూర్పున భానుడుమేలుకొనక ముందే..., జనీప్రియ దూరమవకముందే , వెలుగురేఖలు విచ్చుకోకముందే కోడికూతలు రాకపూర్వమే, నిన్ను సేవించడానికిమేము లేచినిత్య కృత్యములాచరించి వడివడిగా నిన్ను చేరి నీ దర్శనమునకై సుమారుగా నెలరోజుల నుంచి మేము వేయి కనులతో ఎదురుచూస్తున్నాం స్వామీ మా మొర ఆలకించి మమ్మాదుకో గోపాల బాల. సర్వమూ శ్రీకృష్ణమయమే అయినా ఇంకా ఇంకా ఈ నీ మాయలోనే ఉన్న మమ్ము నీవే రక్షించి కాపాడాలి శ్రీ వేంకటరమణా.. ఆపదమొక్కులవాడా వేంకటేశ విభో!
వంగక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరు ముగత్తు శేయరై యాల్ శెన్ఱిఱైంజి
అంగప్పఱై కొండం వాతై అణిపుదువై
.... నేటి దాకా అమ్మ ఇచ్చిన పాశురాలను పాడుకొన్నాం. బోగరంగడు గోదాచేయని గ్రహించిన రోజే భోగి. ఈరోజు అటు దేవతలకు ఇటు మన్యుషలోకానికి పండుగే. కనుక ఇన్ని రోజులు మేము ఆచరించిన ఈ సిరినోము ఈ రోజున ఫలాలను అందిస్తుంది కనుక ఈరోజు పొద్దుపొద్దునే్న భోగిమంటలు వేసి దానిద్వారా చీడపీడలను వదిలించుకుంటాం. అలంకారం చేసి పూజించిన గొబ్బెమ్మలను ఇక వాలాడించడానికి వెళ్తాం. నరనారాయణుల ఆకలితీర్చిన దేవత రేగుపండునే కదా. ఆ రేగులోనేకదా ఆదిపరాశక్తి ఉన్నధి. కనుకనే మేమంతా మా పిల్లలకు రేగుపండ్లనే భోగిపండ్లనీ తలపై నుంచి దిగవారా పోసి వారిని ఆశీర్వదించుతాం.పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయడమే కదా. సూర్య ప్రీతికరమైం దీ బదరీ ఫలమేకదా.
ఈ ఆచారంద్వారా రాబోయే తరానికి ప్రకృతి ని గౌరవించాలని, ప్రకృతి సమతుల్యతను కాపాడాలని చెప్తుటాం. ప్రకృతే పరమాత్మ కనుక పరమాత్మను సేవించడానికి అభ్యంగన స్నానాలు ఆచరించి సంతోషం తెల్పడానికి కొత్తబట్టలు కట్టుకుంటాం. అంతేకాదు పసిపిల్లలే పరమాత్మ స్వరూపాలు కనుక మేము ఈ భోగిపండ్లతో పరమాత్మను పూజిస్తు న్నామన్న మాట.
గోదాదేవికి పెరుమాళ్లకు అంటే రంగనికి వివాహం చేసివస్తాం కనుక ఇక జీవితమంతా ఆనందరశ్మినే ఉంటుంది. అది చెప్పడానికే భోగి మరునాడు కొత్తకాంతుల సంక్రాంతి ఏతె స్తుంది. మనకు రాత్రి నివృత్తి పగలు ప్రవృత్తి. దేవతల కూ సంక్రాంతినుంచే ప్రవృత్తి కదా. దానితోనే మనలో దైవీశక్తి ప్రకాశమానం అవు తుంది. ఆ దివ్యశక్తితో మనమూ దైవీగుణాలను పొందుదాం. ప్రతివారిలో పర మాత్మను చూద్దాం.

- మాగంటి రాథిక