Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. తెలవారకముందె మీదు
పల్లవ చరణాబ్జమ్ముల
అతిభక్తిని సేవించగ
అరుగుదెంచినాము దేవ!

2. మేమొనర్చు వ్రతమువల్ల
మేటిమేలు మాకు గలుగు,
వాటినెల్ల వల్లింతుము
వనమాలీ! విని బ్రోవుము

3. పశుగణముల మేపు గొల్ల
వారియింట మురిపాలతో
పెరిగినట్టి పెరియదేవ!
కరుణించుము మా మొఱవిని

4. మేమొనర్చు అంతరంగ
మేల్సేవ లన్నింటిని,
స్వీకరించుమని గోదమ
మోకరిల్లి ప్రణుతుంచెను

5. ‘పఱ’కోసమె వ్రతము కాదు
పరమాత్మా! నీ పద సేవను,
శాశ్వతముగ జేయునట్టి
సౌభాగ్యము మాకొసగుము

6. మీ స్తుతియే ఆనందము
మీ బంధమె మాకు రక్ష
అనవరతము సేవింతుము
ఐహిక వాంఛలు బాపుము

ఇంకా ఉంది