Others

భోగాలనిచ్చే భోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమన్నారాయణుడిని రంగనాథునిగా భావిం చి అండాల్ అమ్మ ప్రవచించిన తిరుప్పావై ప్రబంధంలోని పాశురాలను చదువుతూ నెల రోజుల నుంచీ అనుసంధానించుకుంటూ వచ్చి ఈ భోగీపండుగ రోజున శ్రీ గోదాదేవి (ఆండాళ్) శ్రీ రంగనాథుని వివాహం చేస్తారు. ఈ రోజున తీయపొంగలి వండి నారాయణునికి నివేదన చేసి బంధువులందరూ కలసి ఆ ప్రసాదాన్ని సేవిస్తారు. ఈ ఆండాల్ తల్లికి ఇంతటి మహో న్నతమైన భోగాలనిచ్చిన పర్వం కనుక ఈ రోజున భోగి అన్నారని కొందరి అభిప్రాయం.
సంక్రాంతి పండుగకు మొదటి రోజైన ‘్భగి’ దక్షిణాయానికి, ధనుర్మాసానికి చివరి రోజు. భోగి శబ్దానికి నిఘంటువులు తొలినాడు, పండుగ అనే అర్థాలు చెబుతాయ.
ప్రపంచానికే అన్నం పెట్టే రైతులందరూ తమకు తోడుగా నిల్చి తోడ్పడిన కర్మచారులకు, తమ ఆనంధంలో పాలుపంచుకునే జానపద కళాకారులకు పంచుతూ తాము పండించిన ధాన్యాన్ని వారికి కొంత భాగం వారికి చేస్తారు. అందరూ ఆనందంగా ఉండాలని పంటలో కొంత భాగాన్ని రైతన్నలు కర్మచారులకు ఇచ్చి వారిని ఆనందింపచేస్తారు. హరిదాసులు, జంగం దేవర లు, సన్నాయ మేళం వారు, బుడబుక్కలవారు, గంగి రెద్దుల వారు, పగటివేషగాండ్లు, వీరందరూ గ్రామస్తుల ఇంటి ముంగిటకు వచ్చి వారి వారి సంప్రదాయాలనుగుణంగా కళలను ప్రదర్శిస్తారు. వీరికందరికీ మహిళలు వడ్లను, కొత్తబట్టలను కట్టబెడుతుంటారు. బాలారిష్ట దోషాలు తొల గడానికి సాయంత్రం పూట పిల్లల ఆయురారారోగ్యల కోసం వారిని కూర్చోబెట్టి కొత్తబట్టలు తొడిగి, వారికి భోగిపళ్లు పోయడం మన సంప్రదాయం. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలకు తగిలే దృష్టిదోషం దూరం అవుతుందంటారు. ఇంకా ఆయుర్వృద్ధీ జరుగుతుంది. సాయంత్రం వేళ పేరంటం చేసి ముతె్తైదువులను పిలిచి వారికినువ్వులు బెల్లంతో చేసిన ఉండలను, నానిన పచ్చిశనగలు పండుతాంబూలాలతోపాటు ఇచ్చి వారి దీవనలం దుకుంటారు. కొన్ని చోట్ల బొమ్మల కొలువుకూడా తీర్చడం సనాతన సంప్రదాయమే.
భోగి పండుగరోజున దోసెలు పోసి కోడి కూర చేసి కొత్త అళ్లుళ్లకు విందు చేయడం కొన్ని చోట్ల కనిపిస్తుంది.
ఈ భోగి పొద్దునే్న అరిష్ట నివారణ కోసం భోగిమంటలు వేసి, వాటిలో పాతవి, పనికిరానివయిన వస్తువులు వేసి, ఆ పీడ విరగడైనట్లు భావించడం ఒక ఆచారం. ఈ రోజు తైలాభ్యాంగన స్నానం ఆరోగ్యాన్నిస్తుంది. స్నానపానాదుల తర్వాత భగవదర్శనం మనశ్శాంతినిస్తుంది. సంక్రాంతికి ముందుర నెలరోజులనుంచి మహిళలు అందమైన ముగ్గులు తీర్చిదిద్దుతారు. వాటిమధ్యలో ఆవుపేడతో గొబ్బెమ్మలను తయారుచేసి వాటిని పసుపుకుంకుమలు, తంగేడు, గుమ్మడిపూలతో అలంకరిస్తారు. వాటిచుట్టు కనె్నపిల్లలందరూ ‘‘గొబ్బియలో.. గొబ్బిలయ’’లంటూ పాటలు పాడుతారు. ఆ పాటలలో వారికి అందమైన భవిష్యత్తు ఉండాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతారు.
తెలుగునాటఅంతాసంక్రాంతి పండుగను పెద్ద పండుగగా అబ్బురమైన సంబరంగా జరుపుకుంటారు.
‘‘హరిలోహరి రంగా శ్రీరంగా’’ అంటూ హరిదాసులు తుంబరలను మీటుతూ వాకిళ్లముందుకు వస్తారు. ‘‘శంభోశంకరా .. పరమేశ్వరా’’ అంటూ జంగందేవర పెద్ద శంఖం ఊదుతూ వస్తారు. తమలో శివకేశవుల భేదం లేదని వచ్చిన వారు భగవంతుడనే భావనతో వారికితమ దగ్గర ఉన్న సంపదలో కొంతదానం ఇచ్చి వారి ఆశీర్వాదాలను అందుకుంటుంటారు. మగపిల్లలందరూ చలిపులిని బెదరిస్తూ గాలి పటాలను ఎగురవేస్తుంటారు. ఇంటిపెద్దలందరూ తమతమ ఇంటి ముందర వడ్లకంకులను కట్టి పక్షులకు విందులు చేస్తారు. ఇట్లా సంక్రాంతి ముందురోజు భోగి పండుగను అత్యంత వైభోగంగా జరుపుకోవడం తెలుగువారికే సొంతం.

చివుకుల రామమోహన్