Others

నందనందునికి నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదాదేవి వారి చెలికాండ్రతో బయలుదేరి నందగోపుని ఇంటికి బయలుదేరింది. అక్కడనే ఉన్న యశోదమ్మ ముద్దుబిడ్డడిని కొనియాడుతూ ఇలా చెప్పుతోంది. ఓ కృష్ణా! నందనందనా! నాడు గర్వంతో ముల్లోకాలను గెలిచి దేవతలందరినీ హింసించిన బలచక్రవర్తి మదమణించి త్రివిక్రముడవైన ఓ పరంధామా! నీకే మూడుఅడుగుల నేలను దానం ఇస్తానన్న బలి నుంచి దానాన్ని గ్రహించి మీ దివ్యపాదారవిందంతో ముల్లోకాలను మూడుపాదాలతో కొలిచిన దివ్యపాదార విందా నీకు జయ మంగళం జయమంగళం. రావణాసురుడు అహంభావియై అజ్ఞానియై సీతమ్మ జోలికి వచ్చినందుకే కదా సముద్రాన్ని దాటి లంకాపురికేగి రావణాసురునే కాక అతని లంకనంతా ముట్టడించినావు. అక్కడే ఉన్న ఉత్తముడైన విభీషణుడిని ఏమాత్రం సంశయం లేక రక్షించి కాపాడినావునీకు మంగళాలు అనవలె కదా. బాలగోపాలుని వై ఉండగా శకటాసురుడై వచ్చిన రాక్షసుని ఆ శకటరూపానే్న చిన్ని నీకాలుతో నేలకూల్చిన నీ అసమాన శక్తికి జోహారులు. దూడరూపంలో వచ్చిన రాక్షసుడిని, బకరూపంలో వచ్చినఅఘంతకుడిని, కపిత్థరూపంలో రాక్షసుడిని ఇలా ఎంతమంది రాక్షసులను చిన్నవాడిగా ఆటలాడుకునే సమయంలోనే మట్టుపెట్టావుకదా. నీకు జయమంగళం. పరమాత్మ అని తెలుసుకోలేని ఇంద్రుడు నీ రక్షణలోని వారికి ఇరకాటాలు పెట్టాలంటే ఇంద్రుడికి కళ్లు తెరిపించిన ఓ మహానుభావా నీకు జయమంగళం. శత్రువులను సమూలంగా నశింపచేసి విజయమును తెచ్చిపె ట్టు నీ చేతిలోని వేలాయుధమునకు జయమంగళం . నీ పలువీరచరితములను నోరారా స్తుతించి మానోమునకు కావలసిన పర గైకొనుటకు మేము వచ్చి ఉన్నాము మమ్ము కరుణించుము అంటూ ఆండాళ్ తల్లి తో కలిసి కృష్ణయ్యకు మంగళాశాసనాలుఅందిస్తున్నారు.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899