Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. మదమెక్కిన బలిరాజును
పాతాళమునకు ద్రొక్కిన
వామనావతార! మీరు
పాదాలకు మంగళాలు

2. సీతమ్మను దశగ్రీవుడు
చెరపట్టిన లంకపురిని
ధ్వంసము గావించిన, మీ
భుజకీర్తికి మంగళాలు

3. ఖలులునౌ వత్స మరియు
కపిత్థుల నొక్కమారె
ఉన్మూలన మొనరించిన
సన్నుతాంత! మంగళాలు

4. శకటాసురు నణచే మీదు
చరణ యుగలి ఘనశక్తితో
చక్రధరా! మీ కీర్తికి
శతకోట్లగ మంగళాలు

5. గోవర్థన గిరిని యెత్తి
గోపాలుర రక్షించిన
మీ ఆశ్రీత వత్సలతకు
మేటి మేటి మంగళాలు

6. శత్రుమూక నెదరించిన
చక్రిమాకు ‘పఱ’ నొసగుము
వేలాయుధ! మీకు మాదు
వేవేలగు మంగళాలు

ఇంకా ఉంది