Others

వృథా కాకుండా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాలం చెల్లిన లేదా తాజాగా లేని బ్రెడ్‌ని వంటల్లో వాడలేం.. అలాంటి వాటిని బ్రెడ్ క్రంబ్స్ లేదా క్రౌటన్లుగా మార్చుకోవచ్చు. ముందుగా మిగిలిపోయిన బ్రెడ్ చెడిపోయి బూజు పట్టిందో లేదో నిర్ధారించుకోవాలి. చెడిపోతే దాన్ని ఏం చేయలేం.. పడేయాలి. ఒకవేళ అలా లేకపోతే ఆ బ్రెడ్‌ను చిన్న చిన్న చతురస్రాకార ఆకృతుల్లో కత్తిరించి వాటిపై ఆలివ్‌నూనెను చల్లాలి. ఒవెన్లో బంగారు గోధుమరంగు వచ్చేవరకు బేసి చేసి సర్వ్ చేసుకోవచ్చు.
* కోడిగుడ్లను ఉపయోగించిన తరువాత దానిపై పెంకులను పారేయకుండా తోటలో ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇవి సహజ సిద్ధమైన ఎరువులుగా ఉపయోగపడగల లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా మొక్కలకు పట్టే చీడలను తొలగించడంలో ఇవి ప్రయోజనకారిగా ఉంటాయి.
* వంటగదిలో గడువు ముగిసిపోతున్న బేకింగ్ సోడా ఉన్నట్లయితే వృథాగా పడేయక్కరలేదు. దీన్ని బాత్రూమ్, వంటగదిలోని కఠినమైన మరకలను వదిలించుకోవడానికి ఈ బేకింగ్ సోడాను క్లీనింగ్ ఏజెంట్ వలె ఉపయోగించవచ్చు. బేకింగ్‌సోడాతో కుళాయిలకు, పాత్రలకు తిరిగి వాటి సహజరూపాన్ని తీసుకురావచ్చు. అంతేకాకుండా కుండలు, పాన్స్‌పై ఏర్పడే మొండి మరకలను తొలగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
* ఇంట్లో గడువు దాటిన సుగంధ ద్రవ్యాలు ఉన్నట్లయితే వాటిని కొవ్వొత్తుల పరిమళానికి వినియోగించవచ్చు. కొవ్వొత్తుల మైనాన్ని కరిగించి నచ్చిన సుగంధ ద్రవ్యాలలో కలిపి కొవ్వొత్తులుగా తయారుచేయడమే. కొవ్వొత్తుల తయారీకి అనుసరించవలసిన పద్ధతుల గురించి అనేక వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటాయి. *