Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. శిక్షలమలులో జాప్యము చేయరాదు
తప్పుఁజేసిన వెంటనే తగిన శిక్ష
వేయవలయునద్దానితో భీతిఁజెంది
చెడుకు సాహసింపరు గదా చిన్నపాటి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: తప్పు చేసిన వారికి వేసే శిక్షల విషయంలో జాప్యం చేయకూడదు. వెంటనే శిక్ష అమలుపరిచిన పక్షంలో భయంతో ఏ చిన్నపాటి తప్పు చేయడానికైనా సాహసించరన్న విషయాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్యా ప్రభూ!
తే.గీ. బాల్యమందున సంస్కార మూల్యములను
మదిన నాటిన వృద్ధియై మహినఁ గాంచఁ
బరిమళంబులు వెదజల్లు విరివిగాను
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: బాల్యంలోనే సంస్కార విలువలను ఆ పిల్లల మనస్సులో నాటిన పక్షంలో ఆ విలువలు బాగా పెరిగి ఈ భూమండలమంతా సువాసనలు వెదజల్లుతాయన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్యా స్వామీ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262