Others

మేలు చేసే పొట్లకాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాయగూరలలో పొడుగ్గా వుండే పొట్లకాయలో పోషక పదార్థాలు లభిస్తాయి. ఇందులో నీరు అత్యధికంగా లభిస్తుంది. స్వల్పంగా కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, క్లోరిన్, భాస్వరం, గంథకం, ఇనుము, ఆగ్జాలికామ్లం, స్వల్పంగా ధయామిన్, రిబోప్లోవిన్, అధికంగా కెరోటిన్ లభిస్తాయి పొట్లకాయలో. ఇవన్నీ శరీరానికి మేలు చేసేవే. ఆరోగ్యానికి మేలు చేసేవే. పొట్లకాయతో కూర, కూటు, పెరుగుపచ్చడి, బజ్జీలు చేయవచ్చు. పొట్లకాయ ఔషధపరంగా కూడా ఉపయోగిస్తుంది.
మధుమేహ రోగులు పొట్లకాయను
తినడం మంచిది.
అధిక బరువును తగ్గిస్తుంది. గుండె వ్యాధులను రాకుండా చేస్తుంది.
వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. చలువ చేస్తుంది.
కామెర్ల వ్యాధికి పథ్యంగా ఉపయోగిస్తుంది.
క్రిములను సంహరిస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది.
నీరసాన్ని పోగొడుతుంది. రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంది.
దేహంలోని న్యూట్రిన్ వ్యవస్థ సక్రమంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
అల్సర్ మంటకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.

పండిన పొట్లకాయ ముక్కలను గింజలతో నమిలితింటే మలబద్ధకానికి నివారణ కలుగుతుంది. వాపులను తగ్గిస్తుంది. కఫాన్ని కరిగించే గుణముంది. వెంట్రుకల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
అనారోగ్యం తగ్గి కోలుకుంటున్నవారు పథ్యపు కూరగా పొట్లకాయను ఉపయోగిస్తారు.

- కె.నిర్మల