Others

‘‘పిల్లల్ని కనండి బాబో!’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కుటుంబ నియంత్రణ పాటించండి. ఇద్దరే ముద్దు. ముగ్గురు వద్దు’’ అంటూ ప్రచారం చేసే భారతదేశానికి జపాన్ వేపు చూస్తే, ముక్కున వేలేసుకోబుద్ధివేస్తుంది.
అక్కడ హిరోషిమా, నాగసాకీల ఆటంబాంబు విధ్వంసం తరువాత, అన్ని రకాలా కోలుకొని, అభివృద్ధి సాధించినా, జనాభా విషయంలో, పాపం (ప్ర)గతి లేదు. తాజా సర్వే ప్రకారం మగాళ్లు ముప్ఫయి సంవత్సరాల ముదురు బెండకాయలయినా పెళ్లిచేసుకోరు. చాలామంది ఆజన్మ బ్రహ్మచారులు వున్న దేశం కూడా జపానే.
యువతుల సంగతి చూస్తే మరీ దారుణం. నూటికి నలభై నాలుగు శాతంపైగా మహిళామణులు అసలు పురుష సాంగత్యానే్న కోరటంలేదు. పోనీ మగాళ్ళు? వాళ్ళల్లో నూటికి నలభై రెండుమంది ‘‘సెక్సా? అదేందో మాకు తెల్దు’’ అంటున్నారుట. పోయినసారి కూడా నేషనల్ సెక్యూరిటీ అండ్ పాప్యులేషన్ రీసెర్చి సంస్థ (2010లో) సర్వే చేస్తే, ‘నూటికి ముప్ఫయి అయిదు మందికిపైగా- స్ర్తిలు ‘మగ గాలి’ తగలకుండా, హాయిగా, ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతికేస్తున్నారు’ అని తెలిసింది.
కాబట్టి, రుూసారైనా సంతానవృద్ధి రేటు 1.4 శాతం వున్నది కనీసం 1.8 శాతం దాకా పెంచాలని, జపాన్ గవర్నమెంటు పథకాలు, దోహదకాలు, బహుమతులు వగైరా ప్రకటించి తంటాలు పడుతోంది. వృద్ధుల సంఖ్య, శతాధిక సంవత్సరాల వయస్కుల సంఖ్య పెరుగుతోంది. కానీ ఏం లాభం? 70 శాతం జనం బ్రహ్మచర్యం పాటిస్తూ వుంటే? పిల్లలెక్కడనుంచి పుడతారు?
‘‘పెళ్లి చేసుకోండి. పన్నులు మినహాయిస్తాం. ఉచిత శిశురక్షణ కేంద్రాలు పెడతాం’’ అంటూ, పెళ్లిపీటలు పట్టుకుని ప్రచారం చేస్తున్నది గవర్నమెంటు. విరోధాభాసం అంటే యిదే! సీనియర్ సిటిజన్స్ అత్యధికంగా వున్న దేశాలలో జపాన్‌ది ఫస్ట్ ర్యాంకు!

veeraji.pkm@gmail.com