Others

చలికాలం వచ్చేసిందోచ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక అందరూ రగ్గులు తీసే కాలం వచ్చేసింది. చల్లని గాలులు, విపరీతమైన ఎండ, పెదవులు, చర్మం పగలడాలు, చర్మం బిరుసుగా తయారు కావడం పాదాల చివర్లు పగలడాలు ఇట్లాంటివన్నీ మళ్లీ తెరపైకి వచ్చేస్తున్నాయి. నిన్నటిదాకా గాలి గాలి అనుకొన్న మనం ఇక నుంచి అమ్మో చల్లగాలి.. అంటూ చలిగాలి ముఖం అందాన్ని మరుగుచేసేస్తుంది. పాదాలు పగిలి రక్తం కారుతూ నడవనివ్వకుండా చేసేస్తుంటాయి. అని భయపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొందాం ...
ఈరోజుల్లో చన్నీటి స్నానం కన్నా గోరువెచ్చని స్నానం ఆరోగ్యానిస్తుంది.
చలి వల్ల వేడివేడిగా ఏదైనా తినాలనిపించినా, సెనగ, పెసరపప్పులతో కూడిన వంటలు తినాలి. ప్రకృతి సహజ రంగులున్న కూరలు తినాలి. క్యారెట్, క్యాబేజి, టమోటా, ఉల్లి సలాడ్స్‌గా తింటే చాలా మంచింది. చలికి దాహం వేయదు కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తాగుతుండాలి. శారీరిక బరువును నియంత్రించే వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తుండాలి. వాకింగ్ అలవాటున్నవారు మానేయకూడదు. అలవాటు లేనివారు ఇప్పుడు తప్పక వాకింగ్ చేస్తుండాలి. ఒకేసారి పెద్దమొత్తంలో ఆహారాన్ని తినకుండా అపుడప్పుడూ ఆకలికి సరిపడా పోషకాలు సరిగా ఉండేలా చూసుకుంటూ తినాలి.
చలికాలంలో సీజనల్ ఎఫెక్టివ్ డిస్‌ఆర్డర్ వల్ల మానసికంగా మార్పులు వస్తుంటాయి. అపుడప్పుడూ ఎప్పటి విషయాలో గుర్తుకు వచ్చి మనసు మూగబోతుంటుంది కూడా. దీనిని మూడ్ జింగ్ డిసార్డర్ అని అంటారు. యువతుల్లో ఎక్కువగా ఈ మూడ్‌జింగ్ డిసార్డర్ కనపడుతుంది. నిద్ర ఎక్కువగా వస్తుంటుంది. నీరసంగా కూడా అన్పిస్తుంది. కెరీర్‌ను గురించిన దిగులు కనిపిస్తూ ఉంటుంది. మరికొందరు మోనోపాజ్ వల్ల ఇబ్బందులు ఎక్కువగా పడుతుంటారు.
వీటిఅన్నింటినీ దూరం చేసుకోవాలంటే సమయానికి సరైన పోషకాహారం తీసుకోవాలి. వ్యాయామాలు తప్పకుండా చేయాలి. బద్ధకం వదిలించుకోవాలి. ముఖానికి, చేతులకు,కాళ్లకు కోల్డ్‌క్రీములు రాసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. పాదాల పరిశుభ్రతను పాటించాలి. వేడివేడిగా ఉన్న ఆహారానే్న తీసుకోవాలి. చలిని దూరం చేసుకోవడానికి స్వెట్టర్ లాంటివి ధరించాలి. శారీరిక శుభ్రత వల్ల మానసిక ఉల్లాసం కూడా వస్తుంది. ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటే కెరీర్‌కు సంబంధించిన దిగులు ఉండదు.కెరీర్‌కు అవసరమైన కొత్తదనాన్ని పట్టుకుని ఆకళింపుచేసుకొని వాటిని ఆచరణలో పెట్టి మంచిఫలితాలను పొందాలి.
ఇలా చలికాలంలో వెచ్చదనాన్ని పొందాలి. అపుడే మానసిక, శారీరిక ఆరోగ్యం మీ సొంతం.

-కంచర్ల