Others

వాలు కనులకు నల్లటి వలయాలు శాపమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాత్రి పడుకోలేదా?’’, ‘‘రాత్రంతా ఏడ్చేవా?’’, ‘‘అంతా బానే వుందా, బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు’’- కళ్లకింద నల్లటి వలయాలు ఉంటే జనాలు ఇన్ని విధాలుగా అనుకుంటారు, అడుగుతారు. అందమైన కళ్లకుండే ఆకర్షణ గురించి ఎంతోమంది కవులు ఎన్నో పాటల్లో, కవితల్లో వర్ణించారు. ‘‘నిలువవే వాలు కనులదానా’’’ అని ఏఎన్‌ఆర్ పాడితే, ‘‘వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా’’ అని మరొకరు స్వరపరిచారు. అందమైన కళ్ళకి అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు వాటిని ఎవరు వద్దనుకుంటారు. అలాంటి కళ్లకింద లోతు గుంటలున్నా, నల్లటి వలయాలున్నా అవి ఆత్మవిశ్వాసాన్ని అణచివేసి వారి జీవితాలని చీకట్లోకి నెట్టేస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్‌వల్ల వారి జీవితాల్లో డార్క్‌నెస్ నిండిపోయిందని బాధపడేవారు ఈ విషయాలు తెలుసుకుంటే ఆ నల్లటి వలయాలను మాయం చేసుకోవచ్చు.
కంటి కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి
మన కంటి కింద చర్మం శరీరంలోనే చాలా సన్ననైన చర్మం. దీని మందం అర్థ మిల్లీ మీటర్ వరకు ఉంటుంది. దాని కింద ఉండే రక్తకణాలు ఈ చర్మాన్ని అంటి ఉండడంవల్ల వాటి రంగు చర్మం రంగులో కనిపిస్తుంది. కొంతమందిలో చర్మమే నల్లదిగా కూడా ఉండొచ్చు. ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి కారణాలు:
సరైన నిద్ర లేకపోవడం, ఎక్కువ ఒత్తిడి.
కళ్లకింద క్యారీ బ్యాగ్స్ ( గత వారం చర్చించుకున్నాం)
వయసు- వయసుపైబడేకొద్దీ కళ్ల క్రింద పరిమాణం కొంతమందిలో తగ్గి ఓ గుంటలా కనబడుతుంది. దీనిని టియర్ త్రూ డిఫార్మిటి అంటారు. అలా ఏర్పడిన గుంటలు ఎతె్తైన కనురెప్పల ఛాయ ప్రభావంవల్ల నల్లగా కనిపిస్తాయి. దీనిని షాడోయిం గ్ ఎఫెక్ట్ అంటారు. గుంట లోతు ఎంత ఎక్కు వ అయితే ఈ డార్క్ సర్కిల్స్ అంత ప్రముఖంగా కనిపిస్తాయి.
హైపర్ పిగ్మెంటేషన్
కళ్లకింది చర్మం కొన్ని మందుల ప్రభావంవల్లో, వంశపారంపర్యంవల్లో, సూర్యరశ్మిలో ఉండే యు.వి. కిరణాలవల్లో, నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల నల్లగా మారుతుంది. దానిని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇలా జరగడంవల్ల కూడా డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయి.
కొంతమందిలో కంటి కింది చర్మం చాలా సన్నదిగా అయిపోతుంది. వీరిలో ఆ చర్మం కింద ఉండే రక్తకణాల రంగు ఆ చర్మంపై ప్రతిబింబించి ఈ నల్లటి వలయాలకు కారణమవుతుంది.
కొన్ని ఎలర్జీలవల్ల కూడా ఈ డార్క్ సర్కిల్స్ కలుగుతాయి.
దీనికి చికిత్స
మొదట దేనివల్ల ఈ కళ్ల కింద నల్లటి వలయాలు కలిగాయో నిర్థారించుకోవాలి. దానిని బట్టి చికిత్స చెయ్యగలం. కంటి కింద చర్మాన్ని తాకి అది ఎంత సన్నగా ఉందో తెలుసుకోగలం. ఆ చర్మాన్ని పైకి లేపితే దాని అసలు రంగు ఏంటో తెలుస్తుంది. పైకి లేపిన తరువాత కూడా ఆ చర్మం నల్లగా ఉంటే అది హైపర్ పిగ్మెంటేషన్ వల్ల కలిగిన డార్క్ సర్కిల్స్. అలా కాకుండా చర్మం తెల్లగా కనిపిస్తే అది కింది రక్త కణాల రంగుని ప్రతిబింబిస్తున్నదని అర్థం.
హైపర్ పిగ్మెంటేషన్‌వల్ల కలిగే డార్క్ సర్కిల్స్‌కి కొన్ని క్రీమ్‌లు, కెమికల్ పీల్స్ మరియు లేజర్ చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ నాన్ ఇన్‌వాజివ్ విధానాలు. వీటివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
సన్ననైన చర్మం మూలాన కింది రక్తకణాల రంగు ప్రతిబింబించడం వల్ల డార్క్ సర్కిల్స్ కలిగే వారిలో ఆ చర్మానికి రక్తకణాలకి మధ్య అడ్డుగా ఫిలర్స్ కానీ కొవ్వు కాని పెడతారు. ఫిలర్స్ తాత్కాలికంగా ఉంటాయి. అంటే ఆరు నెల ల దాకా, కొవ్వు శాశ్వతంగా ఉంటుంది. అది మనం గమనించాల్సిన తేడా.
టియర్ త్రూ డిఫెక్ట్
కంటి కింద ఏర్పడిన గుంటలు ఛాయ ప్రభావంవల్ల (షాడోయింగ్ ఎఫెక్ట్) డార్క్ సర్కిల్స్‌కి కారణమైన వారిలో ఆ గుంటల్ని నింపే ప్రయత్నం చేస్తారు. చిన్న గుంటలైతే ఫిలర్స్‌ని వాడతారు. తాత్కాలికం అయినా వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. చాలా లోతైన గుంటలుంటే వారిలో వారి పొట్ట నించి తీసిన కొవ్వుని వాడే ప్రయత్నం చేస్తారు.
ఫిలర్స్ వాడడం చాలా సులువైన చికిత్సా విధానం. అరగంటలో అయిపోయే ఈ విధానంలో అసలు నొప్పి ఉండదు. పేషెంట్స్ మరుసటి రోజునుంచే వారి పనులు వారు చేసుకోగలుగుతారు.
క్యారీబాగ్స్‌వల్ల కలిగే డార్క్ సర్కిల్స్
కిందటివారం చెప్పినట్లు వారిలో బ్లిఫరోప్లాస్టీ అన్న ఆపరేషన్ ద్వారా ఎక్కువగా ఉన్న కొవ్వుని తీయడమో లేక లేని ప్రదేశాల కి తరలించడమో చేస్తారు. ఈ చికిత్సాతో క్యారీబాగ్స్‌తో పాటు డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి.
ఎలర్జీ
ఎలర్జీవల్ల కలిగే డార్క్ సర్కిల్స్‌ని పోగొట్టాలంటే ముందు దేనివల్ల ఎలర్జీ కలుగుతుందో తెలుసుకొని దాని నిషేధించాలి. ఎలర్జీ తగ్గడానికి తగిన మందులు వాడాల్సి వుంటుంది.
పాటించాల్సిన సూచనలు
సూర్యరశ్మిలో వుండే యు.వి. కిరణాల నించి కాపాడుకునేలా నల్ల కళ్లద్దాలు బయటకు వెళ్లినపుడు వాడడం మంచిది.
సన్‌స్క్రీన్ అందులో యస్‌పిఎఫ్-50 ఉన్నది వాడడం ఉత్తమం. ఇది 98 శాతం యు.వి కిరణాలను నిరోధిస్తుంది.
ఎక్కువ ఒత్తిడికి గురైయ్యేవాళ్లు ఒత్తిడిని తగ్గించుకోవాలి. సరైన నిద్ర లేనివారు ఖచ్చితంగా 8 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి.
కొద్దిగా కనిపించే డార్క్ సర్కిల్స్‌ని మేకప్ ద్వారా కప్పిపుచ్చగలం. శాశ్వత పరిష్కారం కావాలంటే వైద్యుడ్ని సంప్రదించడం మంచిది.
టమోటా, కీరా దోసకాయ కళ్లమీద పది నిమిషాలు పెట్టుకోవడంవల్ల కొద్దిమేరకు లాభం కలగవచ్చు. చల్లని రోస్‌వాటర్ కూడా మంచిది.
ఒకప్పుడు ఉద్యోగానికి వెళ్లినవారు తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి అద్దం ముందు నుంచునేంతవరకు వారికి వారి ముఖం ఎలా ఉందన్న విషయం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడున్నా అరగంటకో సెల్ఫీ తీసుకుని జుత్తు బాగుందా, పెదాలపై లిప్‌స్టిక్ తగ్గిందా అని చూసుకుంటున్నారు. నేటి యువతలో అందంమీద అనురక్తి అంతగా పెరిగిపోయింది. బట్టలకీ, బ్యూటీ పార్లర్‌లకి సగానికిపైగా జీతాన్ని ఖర్చుచేస్తున్న వారి కళ్లకింద డార్క్ సర్కిల్స్ ఉంటే భరించగలరా? అందానికి అంత ప్రాముఖ్యత ఇవ్వని ఆ తరం పెద్దవారు గ్రహించాల్సిన విషయం ఇది. ఎందుకీ కాస్మటిక్ చికిత్సలు అని ప్రశ్నించే ఆ తరం వాళ్లు వారి భావాలని నేటి యువతపై రుద్దకపోతే ఇద్దరికీ మధ్య భేదాలు, విభేదాలు ఉండవు.

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com
chitram...
ఛికిత్స తరువాత తొలగిన కంటి కింద నల్లటి వలయాలు

-డాక్టర్ రమేష్ శ్రీరంగం