Others

ప్రేమకోసమై నదిలో పడెనే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ పాతికేళ్ల అమెరికన్ ప్రేమికుడు జాన్ బెనె్నట్- కెనడాలో వున్న తన ప్రియురాలిని కలుసుకోవడానికి రెండు దేశాల మధ్యనున్న సెయింట్ క్రాస్ నదిని - దాని వెడల్పు 500 గజాలు అక్రమంగా దాటి వెళ్లాలనే తెగించాడు. పైగా అతని గాళ్‌ఫ్రెండు గర్భవతి. ఆమెను ఒక పాత ప్రేమికుడు బెదిరిస్తున్నాడు. అమెరికా-కెనడా బార్డర్ వంతెన మీదికి పోతే, కుర్రవాడి రికార్డు చూసి పోకిరీ అన్నట్లు కాండక్టు సర్ట్ఫికెట్ వుంది కనుక అవతలికి నడూ అన్నారు. దాంతో రుూ మజ్నూకి నదిని ఉత్త చేతులతోనయినా తరించేయాలన్న ఆదుర్దా కలిగింది. వెంటనే ఒక గాలి పరుపుకొన్నాడు. దాన్ని ఊదితే, పొంగి పెద్దదవుతుందిగా! ఆ పరుపును నదిలో ఒదిలేశాడు. ఓ కొయ్యముక్కను తెడ్డుగా వాడుకుంటూ ప్రవాహంలో పడ్డాడు. ఇంచుమించు అవతలి వొడ్డు చేరుకుంటూండగా, ఎవరో, రుూ ‘పరువువీరుడి’మీద పోలీసులకి ఉప్పందించారు.
అవతలి వొడ్డున రుూ పైలాపచ్చీసుగాడికి కెనడా పోలీసులు స్వాగతం పలికారు. తన ప్రేమగాథ చెప్పాడు. ‘సెయింట్ స్టీఫెన్‌లో వుంటుంది నా గాళ్‌ఫ్రెండ్’ అన్నాడు. దానికోసం కలాయిస్, మెయిన్‌లమధ్య గల నదికి అడ్డం పడ్డానన్నాడు. బాగుంది గానీ చట్టపరంగా దోషివి. ముందు జైల్లో వో రెండు నెలలు మాకు అతిథిగా వుండు.. ఈలోగా మేము నీ గాళ్‌ఫ్రెండ్‌ని వెదికిపెడతాం’’ అన్నారు వాళ్లు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు పాపం!
ముంబాయి గణపతి రికార్డు!
ముంబాయిలో జి.యస్.బి. సేవామండలివారి మండపంలో విరాజిల్లిన విఘ్నపతి, అయిదే అయిదు రోజుల్లో 9 కోట్ల పైచిలుకు ఆదాయం సంపాదించింది చాలక, కిలోన్నర వెండి, 350 గ్రా. బంగారం కూడా భక్తజనుల కానుకగా అందుకున్నాడు. ఇదో రికార్డు. ప్రకటనల మీద కోటి రూపాయలు వచ్చాయి. హండీలో 69 లక్షల రూపాయలు వేశారు భక్తులు. పూజా టిక్కెట్లమీద ఆరు కోట్ల కన్నా ఎక్కువ రాబడి వుండగా నగల విలువ కట్టించవలసి వుందిట. అంటే బొజ్జ గణపతి బొజ్జనిండా సంపదే అన్నమాట!