Others

సర్వార్థ సాధక చక్రరూపిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీచక్రము, మానవ శరీరం ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
===========================================================
శ్లో॥ కంఠస్థానే చక్ర విశుద్ధే కమలాంతే
చక్రాకారే షోడశ పత్రే, స్వరవర్ణే
మాయాధీశం, జీవ శివాంతం శివశక్తిం

శ్లో॥ విశుద్ధి చక్రనిలయా రక్తవర్ణాత్రిలోచనా
ఖట్వాంగాది ప్రహరణావదనైక సమన్వితా

శ్లో పాయసాన్న ప్రియ త్వక్‌స్థాపశులోక భయంకరీ
అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ

16 దళముల పైన ‘అ’ నుండి ‘అః’ వరకు గల అచ్చులు కలది మరియు ప్రతి అక్షరానికి పైన బిందువు ఉంది. ‘హం’ బీజముగా కలది , సదాశివునికి స్థానమైనది, ఆకాశతత్త్వం కలది అగు, కంఠస్థానమందలి ‘శాకిని’ శక్తి స్థానమైన విశుద్ధ చక్రాన్ని హృదయమందు ధరిస్తున్నాను అని సాధకుడు ప్రార్థన చేస్తాడు. ఈ విశుద్ధ చక్రం కంఠానికి చెందిన, స్వరపేటిక ప్రాంతంలో ఉంటుంది. మన శరీరమందలి చోటును అంటే ఆకాశతత్వాన్ని నియంత్రణ చేస్తుంది. ఈ చక్రాధిష్ఠాన దేవత పేరు ‘‘వజ్రేశ్వరి దేవి’’ వాగేశ్వరి అని కూడా అంటారు. ఈ దేవత ఒకే ఒక ముఖంతో పాటల వర్ణం (తెలుపు, ఎరుపుల మిశ్రమం) లో ఉంటుంది. మన శరీరమందలి సప్త్ధాతువులలోని ‘త్వక్’ అనగా చర్మధాతువునకు అధిదేవతగా ఉన్నది. ఇక్కడి వ్యాహృతి ‘ఓం జనః’ దీనిని సర్వార్థ సాధన చక్రావరణ అని చెప్తారు.
ఈవిశుద్ధి చక్రకర్ణికలో ఒక త్రికోణంలో ఉంది. అందు వృత్తాకార మండలము కలదు. దీనిరంగు తెలుపు. ఇది ఆకాశ తత్వం కలది. ఇందులో కర్మేంద్రియమైన వాక్కు. శబ్దతన్మాత్ర కలవు. అంటే వినిపించేటట్లు చేసే తత్వం. దీనిపైన వర్తుల ఆకారంలో చంద్రమండలము అందు ఆకాశబీజమైన ‘హం’ ఉన్నది. ఈ బీజం తెల్లని రంగులో ఉండి పాశం ధరించిన ఏనుగుపైన కూర్చుని ఉంది. ఈ బీజం (హం) ఒడిలో వృషభవాహనముపై అధిష్ఠించిన సదాశివుడున్నాడు. ఈయన అర్ధనారీశ్వర రూపం కలిగి ఉన్నాడు. పురుషరూపం తెల్లగాను, స్ర్తిరూపం బంగారు వర్ణంగాను ఉన్నరు. ఈయన ఐదుతలలు, పది చేతులతో, శూల, టంక, వజ్ర, ఖడ్గ, అగ్ని, నాగేంద్ర, అంకుశ, పాశ, ఆయుధములు, అభయ ముద్ర ధరించి ఉన్నాడు. ఈ సదాశివుడు శరీరమంతా భస్మం ధరించి, పులి చర్మం కట్టుకుని మెడలో నాగాభరణాలు ధరించి ఉన్నాడు. ఆయన తలపై నున్న చంద్రరేఖలో నుండి అమృత బిందువులు ఊరి ఫాలభాగముపై జారుతున్నాయి. చక్రకర్ణికలోని చంద్ర మండలములో ఎముకల ఆసనంపై ఈ చక్రాధిష్టాత్రియైన ‘‘శాకిని’’ అధిష్ఠించి ఉంది. ‘‘హ్రీం’’మంత్రోచ్చారణతో ఈ చక్రాన్ని ఉద్దీపన చేసుకొనవచ్చును. ఈచక్రం యొక్క శక్తికి అవరోధం కలిగించే విషయములు ఇతరులను తిట్టుట, అరచుట, అసూయ చెందుట, మొదలగు గుణములు. విశుద్ధ చక్ర అనునూప ( శళ్పూళ -ళనళఒదక్యూజజూ ఘశజూ, -్దళూకఇష్ఘ, ఘూకశళ్ఘ,ఔ్ఘనఖఒ) ఈ ఛక్రమునందు వేయి నాడులు కలవు. ఒకసారి శ్వాసపీల్చి వదిలితే వేయిసార్లు స్పందిస్తుంది. మధురంగా పాడగలగడం, మృదువైన స్వరంతో మాట్లాడగలగటం, మొదలైన విభూతులు, విశుద్ధ చక్రం సక్రమంగా పనిచేయడం వల్లనే లభిస్తాయి. విశుద్ధి అంటే శుభ్రం చేయడం. ఈ చక్రాన్ని సక్రమంగా పనిచేయించేది థైరాయిడ్ గ్రంథి. విశుద్ధ చక్రం ఊహాశక్తికి సంబంధించినందున కలలు రావడం పగలంతా చూసిన దృశ్యాలు జన్మల సంస్కారాలు కలలరూపంలో కనబడుతాయి.
శ్రీలలితా సహస్ర నామాలలో 475 నుండి 484 వరకు ఉన్న నామాలు విశుద్ద చక్ర విశిష్టతను, ఆ చక్రాధిదేవత ‘్ఢకినీ’ శక్తి గురించి చెబుతాయి.

శ్లో॥ గ్రీవాకూపే విశుద్ధే నృపదళకమలే శే్వతవర్ణాం త్రినేత్రాం
హసె్తైః ఖట్వాంగ ఖడ్గా త్రిశిఖమపి మసాచర్మ సంధార యంతీం
వక్త్రేణైకేన యుక్తాం, పశుజన భయదాం పాయసాన్నై కసక్తాం
త్వక్‌స్థాం వందే మృతాద్యైః పరివృత వపుషాం ఢాకీనీం వీర వంద్యాం॥
విశుద్ధి చ్రకం అధిదేవత వ్రజేశ్వరి దేవి మూడు నేత్రములు కలిగి ఉంటుంది. అవి ఋక్, యజుర్, సామ వేదములకు, సూర్య చంద్ర అగ్నులకు భూత భవిష్యద్వర్తమానములకు సత్వరజస్ తమోగు ణములకు ప్రతీక.

ఇంకా ఉంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014