Others

ఆశావాద దృక్పథం మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవించడం ఒక కళ. ఆశావహ దృక్పథంతో జీవించడం తెలిస్తే లక్ష్య సాధనకు మార్గాలు సుగమం అవుతాయి. అయితే మన నిర్దేశిత లక్ష్యాలు విశేషమైనవై ఉండాలి. మీరు ఎప్పుడైనా ఆశావహ దృక్పథం నిండివున్న ఆశతో బతుకుతున్న మనిషిని కలిశారా! అలాంటి వ్యక్తి తారసపడినపుడు, కలిసినపుడు మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది.
ప్రస్తుత కాలంలో ప్రతి మనిషీ ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక భయంతో జీవిస్తున్నాడు. ఎటుచూసినా నిరాశ, నిస్పృహ కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆశావహ దృక్పథంతో జీవించడం ఎలాగో తెలుసుకుంటే నలుగురికి తెలుపగలిగితే మీ జీవితాలనుంచి, వారి జీవితాలనుంచి అనేక దుఃఖాలను, అశాంతులను తొలగించి కాపాడినవారవుతారు. అవును! ఇప్పుడు జీవించే కళ ప్రతి ఒక్కరికీ అవసరం. ఎందుకంటే ఆశకు అనుకూలంగా, మనసుకు శాంతినిచ్చే నాలుగు మాటలు ఏ డిక్షనరీలో దొరక్కపోవచ్చు.
ఆశ మనల్ని అనేక రకాల వైఫల్యాలనుంచి రక్షిస్తుంది. ఎప్పటికీ నిరాశను దరిచేరనీయదు. జీవితంలో ఇప్పటివరకూ ఏదైనా జరిగిందో, అది మంచికే జరిగిందని, భవిష్యత్తులో ఏదైతే జరుగుతుందో అది కూడా మంచికే జరుగుతుందనే ఆశ మనిషిని శక్తివంతునిగా తయారుచేస్తుంది. ఈ విధమైన శక్తి సమాజంలోని ప్రతి ఒక్కరిలోకి ప్రవేశిస్తే, అన్ని సమస్యలు అవలీలగా సమసిపోతాయి. అందరూ లక్ష్యాలను చేరుకుంటారు. చాలాసార్లు వేరెవరో సృష్టించుకున్న సమస్యలకు మనం దోషులుగా నిలబడతాం.
అవి మనకు మేలు చేసేవి కాకపోగా మనలను తుచ్ఛమైనవారిగా, చిన్నవారినిగా చేస్తాయి. ఎందుకంటే ఇలాంటి క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకసారి వస్తాయి. ఈ సమయంలోనూ నిరాశ చెందాల్సిన పనిలేదు. ఈ సమస్యలన్నీ మనల్ని మరింత ముందుకు నడిపించేందుకే. మరింత శక్తివంతులుగా తీర్చిదిద్దేందుకే వస్తాయని గ్రహించాలి.
అనేకసార్లు ఆకాశం నల్లని మబ్బులతో కప్పబడి ఉంటుంది. అప్పుడు కూడా సూర్యుడు వెలుగుతూనే వుంటాడు. కానీ మబ్బులు ఉన్న కారణంగా మనకు కనబడకుండా ఉంటాడు. అంత మాత్రం చేత సూర్యుడు లేడు అని నిర్ణయించుకోలేం కదా! అందుకే ఆశను ఎప్పుడూ విడిచిపెట్టకండి. పూర్తి ఆశావహ దృక్పథంతో ఉండండి. మీ ఆశావాదంతో కూడిన చూపువల్ల ఇతరులు కూడా ఆశావాదులుగా తయారయ్యే అవకాశం లభిస్తుంది.
మీరు ఎప్పుడైనా ప్రసన్నచిత్తమైన వదనంతో ఉన్న వ్యక్తిని చూడండి. అతని ముఖం నిండా ఆత్మవిశ్వాసం, ధీరత్వం కనిపిస్తుంది. ఒక నిరాశావాదిలో ఇలాంటి భావన కనిపించదు. ఇద్దరు వ్యక్తులు అన్ని రకాలుగా సమానులై ఉండొచ్చు. కానీ ఎవరైతే నిత్యం ప్రసన్నంగా, ఆశావాదిగా ఉంటారో, వారే శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు. నిరాశావాద దృక్పథంతో వున్న వ్యక్తి ఎల్లప్పుడూ చింతిస్తూ, దిగులుగా అలసిపోయి రోగగ్రస్తుడై కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎల్లప్పుడూ కోపంగా చిటపటలాడుతూ ఉంటాడు. ముఖంలో నిర్జీవమై, మానసిక స్థితిని కలిగి ఉంటాడు.
ఆధునికకాలంలో మనుషుల మధ్య నిజమైన ఆనందం మాయమైపోయింది. దానికి అర్థాలు తెలియకుండాపోయాయి. అనేక రకాల ఒత్తిళ్ళతో మానసిక ఆనందాన్ని దూరం చూసుకుంటున్నారు. మనిషి ఆశావహ దృక్పథంతో, ధైర్యంగా జీవిస్తూ వచ్చే కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ పోవాలి. అప్పుడే మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరడంలో సఫలం కాగలరు.
నిరాశా, నిస్పృహ, భయం ఉన్నప్పుడు, నమ్మకం, ఆత్మవిశ్వాసం లోపించినపుడు మాత్రమే మనల్ని అపజయం వెన్నాడుతుంది. విషయంపై అవగాహన, విశే్లషించి చెప్పగల దృక్పథం, స్పష్టత, ఓర్పు, ఆపై ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నప్పుడు విజయం మన సొంతమవుతుంది.

-పి.ఎం.సుందరరావు