Others

వ్యాస హృదయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదములను విభజించి సమస్త లోకమునకు హితమొనర్ప వేదవ్యాసుడవతరించి ఈ భువిని పావనము చేశాడు. ‘కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేరధమ్, వేదాబ్జ భాస్కరం వనే్ద శమాది నిలయం మునిమ్’, ‘విస్తారో విగ్రహో వ్యాసః’ (అమరం). విస్తారం అంటే విశేషముగా కప్పుకొనుట. విగ్రహః అంటే విశేషముగా గ్రహిచుట. ఆ విస్తారము శబ్ద సంబంధమైనపుడువిస్తరమనబడును (వాచాం విస్తరః). వ్యాస శబ్దానికి విశేషముగా గ్రహించి వేదవాఙ్మయము విస్తరింపజేసిందని అర్థము. వ్యాసుని అసలుపేరు ‘అపాంతరతముడు’. పరమేశ్వరుని ఉచ్ఛ్వాస నిస్వాసాలే వేదాలు. భగవంతుడు అన్నిమన్వంతరాలలో వ్యాసునిగా జన్మించమని ఆజ్ఞాపించాడు.
ద్వాపరే ద్వాపరే విష్ణు వ్యాస రూపే మహామునే- వైవస్వత మన్వంతరములో పరాశర, సత్యవతికి జన్మించినది ఒక ద్వీపంలో. కృష్ణవర్ణంలో ప్రకాశించుటవలన కృష్ణద్వైపాయనుడని, సత్యవతీ తనయుడు కనుక సాత్యవతేయుడని, బదరికావనంలో తపస్సు చేయుటవలన బాదరాయండని, వేద విభాగ కర్తగా వేదవ్యాసుడని పిలువబడినాడు.
వేదములు అనంతములు. భరద్వాజుడు బ్రహ్మను ప్రార్థించి 3 బ్రహ్మదినాలు (25,76,44,80, 000 సం.లు) ఆయుర్దాయము పొంది ఆవగింజలో ఆరోవంతైనా వేదాధ్యయనము చేయలకపోయాడట. అల్పాయుష్కులైన మానవులకు వీలుగా శ్రీమన్నారాయణుడే వేదవ్యాసునిగా అవతరించి వేద విభాగం చేశాడు. ఋగ్వేదము పైలుడనే ఋషికి, యజుర్వేదము వైసంపాయనునకు, సామవేదము జైమినికి, అధర్వణం సుమంతునకు బోధించాడు. గురుశిష్పరంపరగా వినిపింపబడినవి.
అందుకేవాటిని శ్రుతులు అన్నారు. వేదములు సత్యమును, ధర్మమును బోధించుచున్నవి. సర్వమానవ జాతికి వేదములు మూలము. వేదములు భగవత్ జ్ఞానము కావున విశ్వవ్యాప్తములు. వేదములు సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులగు విభజింపబడినవి. వేదాలు 1.పూర్వమీమాంస (కర్మకాండ), 2.ఉత్తరమీమాంస (జ్ఞానకాండ)గా చెప్పబడినవి. జ్ఞానకాండలో ఉపనిషత్తు భాగము చెప్పబడింది. వైష్ణవీయ తంత్ర సారములో, వ్యాసులవారు నారాయణ క్షేత్రంలో భగవద్గీత మహిమను చెప్పినట్టు శౌనక మహర్షి సూతమునీంద్రునకు చెప్పాడట. వేదాల అంత్యభాగములను (ఉత్తరమీమాసం) స్వయానవ్యాసులవారే ‘బ్రహ్మసూత్రాలకు’ కర్తృత్వం వహించారు. భగవంతుని ప్రస్థానము చేరుటకు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు దోహదపడ్డాయి. కలియుగములో వేదోద్ధారణకు భారతావనిలో ముగ్గురుఆచార్యులు అవతరించారు.
పరమాత్మ జ్ఞానము వారి సిద్ధాంతాల ద్వారా ఎరుకపరచి మోక్షమార్గము ఎందరికోచూపారు. అదే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలు. మరి వ్యాస హృదయము ఏది అని అంటే ముందుగా త్రిమతాచార్యుల సిద్ధాంతాలను తెలుసుకొనవలెను. శ్రీ శంకర భగవత్పాదులవారు క్రీ.శ.789 జన్మించారని విద్వాంసుల అభిప్రాయము. వారు ప్రతిపాదించినది అద్వైతము. చిరుత ప్రాయముననే ( 4 సం.లకే ) చతుర్వేదాలను ఆపోసనపట్టారు. ఆపత్సన్యాసము తల్లి అనుమతితో స్వీకరించి యావద్భారతము కాలినడకన 4 పర్యాయములు సంచరించి అద్వైత భేరీ మ్రోగించారు. అవైదిక మతాలను ఖండించి కోటి గ్రంథాలసారము అర్థశ్లోకంలో చెబుతానన్నాడు.
‘శ్లోకార్థం ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథికోటిభిః
బ్రస్మ సత్యం జగన్మిథ్య జీవోబ్రహైవనాపరా’’
ప్రస్థానత్రయానికి భాష్యము వ్రాశారు. బ్రహ్మము ఒక్కటే సత్యము, మిగిలిన దృశ్య ప్రపంచము మిథ్య అన్నారు.
‘యన్నాదౌ యచ్చ నాస్తన్యో, తన్మధ్యేభాసమప్యసత్
అతో మిథ్య జగత్సర్వ మితి వేదాంతడిండిమః’
ఏది మొదట లేదో, చివరన లేదో అది మధ్యలో కనిపించినను లేనిదే యగును. సృష్టికి పూర్వము, లేనిదియు, ప్రళయానంరము లేనిది యగు జగత్తంతా ఇప్పుడు కన్పించినను మిథ్యయే. దీనిని ‘మాయావాదము’ అని అంటారు.
సామా, సామాయ (ఎది లేదో అదే మాయ. లేనిదానికి ఉనికి లేదు. త్రివిధావస్థలు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి) ఒక అవస్థ ఉన్నప్పుడు ఇంకొకటి వుండదు. జాగ్రదావస్థ కూడా కలే. ఈ మూడు అవస్థలను సాక్షిగా చూసే ‘తురీయావస్థ’లో బ్రహ్మస్థితి తప్ప అన్యము కానరాదు. రామకృష్ణ పరమహంస చెపిప్నట్టు చక్కెర బొమ్మ నీళ్లలో బడితే దాని ఉనికి ఎలా కోల్పోతుందో ఆత్మసాక్షాత్కారము అయిన వెంటనే జీవత్వము నశించి బ్రహ్మత్వము సిద్ధిస్తుంది. రజుజ సర్పభ్రాంతి చెబుతారు. చీకటిలో పాము అని భ్రమించి వెలుతురు రాగానే తాడని తెలిసినట్టు, అవిద్య నశించగానే బ్రహ్మమే మిగులుతారు. ‘బ్రహ్మ విద్ బ్రహ్మై వ భవతి’’- ఇంకొకసారి మిగతావి చూద్దాం.

- కె. రఘునాథ్, 9912190466