Others

కదంబ వనవాసిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వరీమాత గొప్ప ఇల్లే మణిద్వీపం
బ్రహ్మలోకంపై సర్వలోక నివాసస్థానం మణిద్వీపం
త్రిలోకాలలో లోకం కన్నామించిన సుందరలోకంలేదు
అక్కడే చల్లగా సుఖంగామనుగడ బ్రహ్మాండాలన్నింటికీ

ఇనుప, కంచు, సీసం, ఇత్తడి, పంచలోహ
బంగారు,పుష్పరాగ రత్నపద్మరాగ వజ్ర ప్రాకారాల మధ్య
చింతామణి గృహం శ్రీదేవీ దివ్య మందిరం
శ్రీమాత శ్రీచక్రాకారంలో అమ్మవారి దివ్య ప్రకాశం

జగదంబ మెడలో ముత్యాల గుత్తుల చింతాకు పతకం
గండుతుమ్మెదలు మూగిన ముంగురుల ముఖకమలం
ఆ దేవి నాభిగంగానది త్రికోణ సుడిగుండం
ఆమె కోమలి, సుకుమారి, అందాల కందాలరాశి

శ్రీమాత మయము విశ్వమంతయు
శ్రీమాత విశ్వమయురాలు విశ్వమంతయు
శ్రీమాత మయం కాని వస్తువులేదు
శ్రీమాతమయంకాని పరమాణువూలేదు

సకల సంపదలకు, సంపూర్ణ సర్వజ్ఞుతత్వానికి
సకల తేజస్సులకు సర్వ పరాక్రమాలకు సర్వోత్తమం
సర్వలోకాలాల్లో ఉత్తమోత్తమము పరమధామం
మణిద్వీపాన్ని స్మరించు అనునిత్యమూ

సృష్ట్యారంభంలో వస్త్రం లాగావ్యాకోచిస్తుంది గరిమాశక్తి
ప్రళయ కాలంలోముకుళించి సంకోచిస్తుంది అణిమాశక్తి
మహావిద్యలన్నీ మాయా శబలవిగ్రహభగవతిని ఉపాసిస్తూ న్నాయి
చింతామణి గృహంలో జగదంబ ధగద్ధాగాయ మానం
ఫృధీతత్వం ఉదక తత్వం అగ్ని తత్వం వాయుతత్వం
వీటి ఉపరితలం పై ఆకాశతత్వంభ్రూమద్యంలోనిమన్తసష్టం
కులపధమైన సుషుమ్నామార్గం భేదించి సహస్రార సరోజంలో
ఏకాంతగా సదాశివుణ్ణి గూడి సంచరిస్తావు శ్రీచక్రమధ్యంలో
వేదమరుూ మంత్రమరుూ సర్వతంత్రమరుూ
సర్వేశక్తిమరుూ సర్వరూప అరూపమరుూ
సింహవాహనాసీన హ్రీం బీజాక్షర రూపిణీ
సర్వచరాచర జగజ్జయినీ యాదేవీ సర్వభూతేషు

షడ్చక్ర జ్వాలలకుపరితలం మీద
సహస్ర దళ పద్మంలో గోచరం భవత్పాదాంబుజ యుగం
శరజ్జ్యోత్స్నా విశారదా వీణా పుస్తక పాణీ
మధుక్షీర ద్రాక్షామధురిమ మహాజ్ఞాన ప్రదాయినీ

చంద్రకాంత మణిలాగాకాంతి సమూహామృత రసం
సూర్యచంద్రాగ్ని రూపక షట్చక్రోపరితలం మీద
మహాపద్మాటవీలో కూర్చున్న తటిల్లతాతన్పీకళలతల్లీ
పరమానంద లహరులలో విహరించు జ్ఞానజలకాలతో శ్రీమాత

మ్రోగే చిరుగంటల మొలనూలుతో కలశకుంభ స్తన భారంతో
పరిక్షిణమైన సమముతో పరిణిత శరచ్చంద్ర నవకంతో
ధనుర్భాతి పాశాంకుశాలుధరిచిన శుత్రిపురాంతకి సుందరీ
నాముందు సదసాక్షాత్కరించినీ అక్షీం కృపాసాంగ వీక్షణదక్షత
జ్యోతి బ్రహ్మం పరమశివుడు నాద బ్రహ్మం పరాశక్తి
శివశక్తుల సమ్మేళనం విశ్వశాంతి అవ్యక్తం
వారి వ్యాపకం అండపిండ బ్రహ్మాండాల వ్యక్తం
దినకర కోటి ప్రభాకర దివ్య కాంతిమయం

అనంత మవ్యయం శాంత మక్షమాలాధరం
సిద్ధ సురాసుర పాదపంకజ ద్వయం
అష్టదళోపరివేష్ఠిత సర్వసముద్భవ కారణశబ్దం
అనేక ద్వంద్వాలతో మాయామోహనరూపం

-ఆర్. లక్ష్మణమూర్తి, 7207074899