Others

శుద్ధజ్యోతి స్వరూపిణి ‘‘గాయత్రీ మాత’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదమాత లోకమాత గాయత్రీదేవి. ఉపాస్యమాన పరదేవత. వేదములకు మాతృస్థానమై నిలిచినదీ తల్లి. ‘‘గాయత్రీ ఛందసాంమాతా’ అని వేదం. పూర్వం స్వర్గం నుండి యజ్ఞార్థం ఓషధీ విశేషమైన ‘సోమలత’ కొరకు అన్ని ఛందస్సులు వెళ్లాయి. గాయత్రీ వెళ్లలేదు. ఎంత ప్రయత్నించినా సొమలత భూమికి రాలేకపోయినది. పిదప గాయత్రీ ఛందస్సు వెళ్లింది. ఆ తల్లి మహిమాతిశయం వల్ల సోమలత భూమికి రావడం జరిగింది. సకల ఛందోమంత్రములను ఉపయోగిస్తూ యజ్ఞం చేయడం వల్ల సకల దేవతా ప్రీతి జరిగింది. జగత్కల్యాణం లభించింది. అన్ని ఛందస్సుల కంటే గాయత్రీ ఛందస్సుకు అక్షరాల పోలిక తక్కువగా ఉంటుంది. వేద వాక్యాలలో ఇష్టసఖిగా నున్నదట.
తస్మాత్ సత్యాతే గాయత్రీ కనిష్ఠాం ఛందసాగ్‌ంసతీ’’ యని ఇది మసిమ గల్గిన ఇరవై నాల్గు అక్షరాల మంత్రమునకు గాయత్రి యని, సావిత్రి యని, ప్రసిద్ధనామాలు కల్గియున్నవి. మంత్రాధిష్ఠాన దేవత సావిత్రి. మంత్రార్థ వాచ్యుడు సవితృదేవత.
సమస్త శ్రుతి, స్మృతి పురాణేతిహాసాగమ తంత్ర శాస్త్ర గ్రంథాలలో గాయత్రీ మంత్రం యొక్క వైశిష్ఠ్యం నిండి ఉంది. త్రికాలలో ఈమంతాపాసన ద్వారా వేదములలో వచ్చే గాయత్రీ అనుష్ఠుప్ జగతీ త్రిష్ఠుప్ బృహతీ పంకి అనుఛందోమంత్రములను అధ్యయనం చేయుట చేతనే సూర్యమండలం పోషింపబడుతుంది. దీనినే వేదాధ్యయనం అంటారు. తద్వారా ఉభయ లోకాలలో క్షేమం కరస్థితి కల్గుచున్నది.
ఆసేతు హిమాచల పర్యంతం ఉపాస్య దైవం పరదేవత గాయత్రీ మాత. ప్రణవ సంపుటముగా ఆరుఓంకారములతో సంయుక్తముగా గాయత్రిని ఆరాధించాలనీ ఐదు ప్రణములు గల గాయత్రిని సేవించాలనీ దేవీ భాగవతం తెలిపింది. సచ్చిదానందమయమైన సంధ్యనే గాయత్రి అని పిలుస్తారు.
‘ఓం భూర్భువస్స్వః తత్సవితుర్వరేణ్యమ్
భర్గోదేవస్య ధీమసి ధియోయోనః ప్రచోదయాత్’ అన్నది మంత్రం.
భావం: ఓ సకల సచ్చిదానందరూపా! అఖిల జగత్తును సృష్టించి ప్రకాశింపజేసే నీ యొక్క ప్రసిద్ధం. సర్వోత్కృష్టమైన విజ్ఞాన స్వరూపాన్ని ధ్యానిస్తున్నాము. ఉపాసిస్తున్నాము. సర్వేశ్వరుడవైన నీవు మాకు విద్యాబుద్ధులను సత్కర్మలాచరించే విధంగా ప్రేరేపించుము. సంధ్య , సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే వారలు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని భార్యలు. పేర్లు వేరయినా వీరందరూ ఒకటే. పరమేష్ఠి మదిలో ఉత్పన్నమైన కోరిక సంధ్య. ఆమె జనించగానే బ్రహ్మ ప్రజాపతులు సంక్షోభం చెందారు. శివుడు ఆక్షేపింపగా సిగ్గుతో నిందించుకుని తన శరీరాన్ని అగ్నిలో వదలాలని, చంద్రభాగా నదీతీరంలో విష్ణువు తెల్పిన రీతిన ఎవరికీ కన్పించకుండ వెళ్లి మేధా తిథి చేసే జ్యోతిష్ఠోమమనే యజ్ఞకుండంలో దూకింది. హరిఆదేశం ప్రకారం అగ్ని ఆమెను సూర్యమండలానికి చేర్చాడు. సూర్య భగవానుజుడు ఆమెను రెండు భాగాలుగా చేసి తన రథంపై ఉంచుకున్నాడు.
ఊర్థ్వ భాగం ప్రాతస్సంధ్యగాను, అధోభాగం సాయంసంధ్యగాను అయింది. ఈశ్వరశక్తియే సంథ్యయని భారద్వాజ స్మృతి ఆ సంధ్యారూపమే ఈ సంధ్య. సూర్యుని యందలి చైతన్యశక్తి ఆమె. ఉపాసించే వారి మనోబుద్ధుల్ని నివృత్తి మార్గానికి ప్రేరేపించే దేవత సంధ్య.
ప్రాతఃకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నవేళ సావిత్రిగా, సాయంవేళ సరస్వతిగా ఉపాసింపమడుతుంది సంధ్య. సంధ్యానుష్ఠానం ఆరోగ్యదాయకం. పరంలో మోక్షదాయకం.
అమృతాన్ని అందించే తల్లి గాయత్రి. త్రికాలలోను జపించాలి. ఓం కారంతో మూడు వ్యాహృతులతో కలిపి గానం చేసేవానిని ఈ మంత్రం రక్షిస్తుంది. గాయత్రి మంత్రంలో రక్షణ శక్తి ఉంది. పరమాత్మను చేర్చే మంత్రమే గాయత్రీ మంత్రం.
కాలచక్రంలోని ఆశ్వయుజమాసంతో జగదంబయైన భగవతిని పలురూపాల్లో నవరాత్రులందు ఆరాధించుట సంప్రదాయమైనది. దేవి గాయత్రిగా అందంగా అలంకరించి ఆరాధించి షోడశోపచార పూజలాచరించి నైవేద్యాలు నీరాజనాలందిస్తారు. అమ్మ అనుగ్రహానికి పాత్రులౌతారు.

- పి.వి. సీతారామమూర్తి 9490386015