Others

అక్కడ పదిశాతం మంది టీచర్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీచర్స్‌డే- డా సర్వేపల్లి రాధాకృష్ణగారి జన్మదినం. వూరూరా స్కూలు స్కూలునా పిల్లకాయల చందాలతో ఘనంగా జరుగుతున్నది ఏటేటా. సందర్భం వచ్చింది. కర్నాటకలోని ఓ గ్రామం జరిగిన అధ్యాపక దినోత్సవాలు- వార్తల్ని ఉత్తేజపరిచాయి.
దక్షిణ కర్ణాటకా ప్రాంతం బెల్గాం జిల్లాలో - సావన్ దత్తీ తాలూకాలో- ‘ఇన్‌చాల్’ అనే గ్రామం వుంది. జనాభా ఎంత అనుకున్నారూ? ఆరేడు వేలు మాత్రం వుంటుంది. కానీ ఆ వూళ్ళో ప్రతీ యింటా- టీచర్స్ డే చేసుకున్నారు ప్రత్యేకంగా. ఓ యింట్లో పదిమంది టీచర్లదాకా వుంటే, కనీసం ఒక్కడయినా టీచర్ లేని కుటుంబం లేదక్కడ!
గ్రామంలో ఎవర్నడిగినా బడిపంతులు వృత్తికన్నా మరొక గొప్ప ఉద్యోగం వుండదు. లేకపోతే పొలం పన్లు చేసుకుంటారు. ఆ గ్రామానికి ‘బడి పంతుళ్ల గ్రామం’ అన్నది బిరుదు. జనాభాలో పదోవంతుమంది అధ్యాపకులే! డి.ఇ.ఓ చెప్పిన విశేషాలను బట్టి చూస్తే- షబ్బీర్ మీర్ జన్నావర్ అనే అధ్యాపకుని కుటుంబంలో ఏకంగా 13మంది టీచర్లు వున్నారు. 1971 దాకా రుూ గ్రామంలో కేవలం ఎనిమిదిమంది టీచర్లుండేవారు. అదీ ఎలిమెంటరీ స్కూలులోనే. పైచదువులు అంటే ఆరో క్లాసునుంచీ- బలిహోంగావ్‌కి కాళ్లీడ్చుకుంటూ మైళ్లకొద్దీ దూరం పోవాల్సిందే.
ఆ వూరికి శివానంద భారతీ స్వామీజీ 1970 ప్రాంతంలో వచ్చాడు. ఆయన రాకతో గ్రామం ఉత్తేజం పొందింది. ‘‘ఒక టీచర్ వందమంది మతగురువులకన్నా మిన్న’’ అంటారాయన. యువతకు ఉచిత శిక్షణాకేంద్రాలు తెరిచాడు. ‘ప్రసాద నిలయం’ దాని పేరు. అక్కడ ఉచిత ప్రసాదం (్భజనం) పెట్టి మరీ పాఠాలు చెప్పి- తిరిగి ఆ పాఠాలు విద్యార్థులకు ఎలా చెప్పాలో కూడా నేర్పించాడు. ఆయన ధర్మమా అని యివాళ అక్కడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలే ఏం కర్మ- ఒక డిగ్రీ కాలేజీ కూడా ఝామ్మని సాగుతోంది.
అక్కడ, అన్ని పాఠ్యాంశాలూ లభిస్తాయి. సంస్కృతం కూడా బోధిస్తారు. శివానందభారతీ స్వామీజీలాంటివాడు జిల్లాకొక్కడున్నా చాలదా? దేశం ‘సంపూర్ణ ఆక్షరనిలం’ కావడానికి!
అమ్మాయి డ్రయివింగ్ చెయ్యకూడదుట!
ఇజ్రేల్‌కు కూడా రుూ వివక్ష వ్యాపించింది. సంప్రదాయబద్ధమయిన యూదు కుటుంబంలోని వనితలు మోటారు కారు డ్రయివింగ్ చేయరాదుట. తన భర్త డ్రయివింగ్ పరీక్షలు ఫైలయిన కారణంగా వికలాంగురాలయిన బిడ్డను స్కూలుకు చేర్చేటందుకు ఓ టీచరు కారు తోలడం నేర్చుకుని, లైసెన్స్ తీసుకుంది.. అంతే.. ఆమెను ఉద్యోగంలోంచి తీసేశారుట! పైగా, ఆ స్కూలు ప్రిన్సిపాల్ కూడా వనితామణియే!

-వీరాజీ