Others

సినీతారలకు రేషన్ కార్డులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా బిక్కీ బీదాకి రేషన్ కార్డులుంటాయ్. ఏ కార్డుకైనా ఎన్నో ఉపయోగాలుంటాయ్. కానీ, విశ్వవిఖ్యాత సినిమా నటీమణులు- దీపికా పదుకొనె, సోనాక్షీసిన్హా, రాణీముఖర్జీ, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి సంపన్న తారలకి- చౌకధరల దుకాణాల మీద రేషన్ తెచ్చుకుంటున్న కార్డులున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఖాయమ్‌నగర్ తహశీలులో వున్న సాహబాగంజ్ గ్రామంలో రేషన్ కార్డులున్నట్లు, వాళ్లు వాడుకుంటున్నట్లుకూడా నమోదైంది. ముగ్గురుకీ భర్తలున్నారు. ఒక్క దిపికాకి మాత్రం జనరల్ క్యాటగిరీలో వుండగా, మిగతా ముగ్గురు తారలూ ఓ.బి.సి, బి.సి వర్గాలుగా నమోదై వున్నారు. ఈ వార్తని కొందరు వినియోగదారులు పై అధికారులకు అందజేసేదాకా సరుకులు సరఫరా అవుతూనే వున్నాయి.
దీపికా పదుకొనె భర్త పేరు రాకేష్‌చాంద్. రాణీముఖర్జీ మగని పేరు రామ్‌స్వరూప్, శత్రుఘ్నసిన్హా కుమార్తె సోనాక్షీ భర్త పేరు రమేష్ చాంద్. ఇతగాడు రాకేష్ చాంద్‌కేమవుతాడో తెలియదు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ సాధూలాల్‌ని పెళ్లి చేసుకున్నదిట.
దీంతో షాక్ తిన్న కొందరు దుకాణదారు మీద ఫిర్యాదులు పంపించగా మాజిస్ట్రేటుగారు అవాక్కయిపోయాడు. వెంటనే డిప్యూటీ మాజిస్ట్రేటుని అసలు కథ ఏమిటో పట్టుకురమ్మని ఆదేశాలు పంపించాడు. ఈ వార్త తెలిసిన సినిమా స్టార్స్ అప్‌సెట్ అయిపోయారు. రేషన్ కార్డులమీద పేర్లు వున్నాయనీ- భర్తలున్నారనీ, భర్తలకు పక్కా నామధేయాలు వున్నాయనీ విని మూర్ఛపోయినంత అయినారుట. దర్యాప్తు జరుగుతోంది.

-వీరాజీ