Others

ఏ రోడ్డు చరిత్ర చూసినా గోతులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదు రోడ్డు బాధలు ఢిల్లీకి, ఢిల్లీ బాధలు హైదరాబాద్‌కీ చెప్పుకొని, మొర్రోమని విలపించనక్కరలేదు. మధ్యప్రదేశ్‌లో రోడ్లు ఎంత అధ్వాన్న స్థితిలో వున్నారుూ అంటే, అక్కడ ‘ఆప్ పార్టీ’ సమన్వయకర్తగావున్న అగ్రవాల్ రోడ్డుకి అడ్డంగా పడి ఆందోళన ప్రారంభించాడు.
భోపాల్‌లో, ఝాన్సీ ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకమైన రాజమార్గాలున్నాయి. వీటి నిండా భయంకరమైన గోతులున్నాయ్. వీటిని ఇటీవల కురిసిన వానలు- అంటే వాన దేవుడే అంటున్నారు అధికారులు, కాంట్రాక్టర్లు- ‘నేరం మాది కదా వరుణదేవుడిది’ అంటూ తప్పించుకుంటున్నవారికి వ్యతిరేకంగా, భోపాల్ రాజమార్గాన ఒక వింత అయిన ఉద్యమం సాగింది ఈ వారం.
స్థానిక ఎన్నికలకి ముందు భోపాల్‌లో యించుమించు 800 కిలోమీటర్ల రోడ్డులకు కోట్లాది రూపాయలు వెచ్చించి రిపేర్‌లు, పునర్ నిర్మాణాలూ సాగించారు కానీ, అన్నీ కన్నాలడిపోయాయి. కొన్ని కొట్టుకుపోగా- మరికొన్ని ‘కోరుకు’పోయాయి. ఉద్యమకారులు అటు మొక్కలు నాటండి ఉద్యమానికి బాసట- యిటు వీధుల మరమ్మతులకి డిమాండు. రెండూ కలిపి వందలాది మొక్కలు పట్టుకొచ్చారు. రోడ్లమీద, గోతుల్లో రుూ మొక్కల్ని నాటారు. ఓ మొక్కకి రాష్ట్ర పి.డబ్ల్యూడి మంత్రి రామ్‌పాల్‌సింగ్ గారి పేరెట్టి సంబరం చేశారు. మరో చెట్టుకి స్థానిక పరిపాలనామాత్యుడి దివ్యనామం- విశ్వాస్ సారంగ్‌గారి పేరెట్టారు.
ఇలా రోడ్లకంతలకు గౌరవనీయులయిన నాయకుల పేర్లు తగిలించబడ్డాయ్. ‘‘ఓ పక్షం రోజులు టైమ్ యిస్తున్నాం, కాంట్రాక్టర్లమీద చర్యలు తీసుకుని- వాళ్ల మెడలు వంచి యుద్ధ ప్రాతిపదికమీద రోడ్లకు అస్తర్లు వేస్తారో- లేక సదరు అధికారులను ఆ గోతుల్లో పాతెయ్యమంటారో తేల్చుకో’’మన్నట్లు ఆందోళనకారులు వానల్లో, వరదల్లో శివాలుత్రొక్కారు.
‘‘హైదరాబాద్‌లో రోడ్లు చూస్తే ఢిల్లీవాసులు, భోపాల్ వాసులూ మూర్ఛబోతారు’’ అన్నాడో ఆటోవాలా!

-వీరాజీ