Others

ఎవడు బ్రతికాడు, మూడు యాభైలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎవడు బ్రతికాడు మూడు యాభైలు- అంటే నూట యాభై సంవత్సరాలు?’’ అన్నాడు శ్రీశ్రీ. కానీ ప్రపంచంలో యిప్పుడు ముగ్గురున్నారు. అందులో యిద్దరు ‘‘మూడు యాభైలు బ్రతికేశాం- యింకా బ్రతికే వున్నాం’’ అంటున్నారు. మూడోవాడు ఇండోనేషియాకి చెందిన ‘ఎమ్‌బాహ్‌గోధో’ నూట నలభై ఐదేళ్ళవాడు. మరో ఐదేళ్లు లాగించేలాగే వున్నాడు.
ఐతే, ఇదిలా వుండగా, నైజీరియాలో మరో మహావృద్ధుడున్నాడు. అతను తన వయసు 171 సంవత్సరాలు అంటున్నాడు. అతని నామధేయం జేమ్స్ ఓలో ఫింత్యూరుూ- కాగా, ఇతియోపియాకి చెందిన ‘్ధక్వాబోఎబ్బా’- నాకు 163 సంవత్సరాలున్నాయండీ, నాకే రికార్డు’’ అంటున్నాడు. కాకపోతే గోధో మహాశయుడు 145 సంవత్సరాల క్రితం పుట్టినట్లు రికార్డు దొరికింది.1870 డిసెంబర్ 31న సరిగ్గా న్యూయియర్ ముందు రోజు పుట్టిన రుూ వృద్ధమహాశయుడు- ‘‘నాకు చచ్చిపోవాలనే వుంది. 1992లోనే నేను నా సమాధికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. స్మారక ఫలకం కూడా రెడీగా వుంది’’ అంటూన్న గోధేకి మనుమలు కూడా గతించారు. నలుగురు భార్యలూ స్వర్గం చేరుకున్నారు. ఎన్ని తరాలో గడిచాయి. సొంతంగా స్నానం చెయ్యలేడు. అన్నం తినిపించాలి. చూపు ఆనక టీవీ చూడడం మానేశాడు. కాకపోతే చెవులు బాగా వినబడుతున్నాయి. కాబట్టి రేడియో సెట్టే ఆయన చెలికత్తె. అలా వింటూనే వుంటాడుట.
‘‘ఎలా ఇంతకాలం బ్రతికావయ్యా?’’ అంటే, ‘‘ఓపికగా’’ అంటాడు. ‘‘నాకు వోపికగా, వోరిమీ, బ్రతుకుమీద విరక్తీ వున్నాయి. అంచేతనే ‘చావు’ దూరం జరిగిపోతోంది’’ అంటాడు. గిన్నీస్‌బుక్‌లోకి ఎక్కడానికి, రుూ ముగ్గురిలోనూ గోధేకే ఎక్కువ ఛాన్సులున్నాయిట!
‘‘ఏం చేసుకుంటాను సర్ట్ఫికెట్‌ను. నెత్తిన పటం కట్టుకోనా?’’ అని బోసి నవ్వు నవ్వేస్తాడు ఎమ్‌బాహ్ గోధే!!

-వీరాజీ