Others

గురుశిష్య సంబంధం ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితంలో గురుశిష్యుల బంధం చాలా పవిత్రమైనదే కాక విలువైనది. విద్య, వివేకం నేర్పుతూ సకల విషయాలపట్ల అవగాహన కలిగేలా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, చైతన్యపరిచేవాడే గురువు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగించేవాడు సద్గురువు.
హిందూ సంస్కృతి గురువులకు సమున్నత స్థానం కల్పించింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని చాటుతూ తల్లిదండ్రుల తరువాత స్థానం ఇచ్చి గౌరవించింది. గురుబ్రహ్మ, గురువిష్ణుః గురుదేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ అని స్తుతిస్తూ గురువును బ్రహ్మ, విష్ణు మహేశ్వరులతో పోల్చిన సంప్రదాయం మనది. అందుకే గురువును తల్లిదండ్రుల కంటే మిన్నగా గౌరవించి పూజించాలి విద్యార్థులు. గురువు ప్రాధాన్యత గుర్తించడంవల్లనే ‘గురువు, దేవుడు ఒకేసారి ప్రత్యక్షమైతే గురువుకే తొలి వందనమని, దేవుడి గురించి తెలిపింది గురువే’ నన్నాడు కబీరుదాసు.
సృష్టిలో భార్యాభర్తలు, తండ్రీ కొడుకుల వంటి సంబంధాలను సృష్టించిన దేవుడు, వాటికి అతీతమైన గురుశిష్య సంబంధాన్ని ఆత్మీయ బంధంగా సృష్టించాడు. ‘జిజ్ఞాసపరుడైన శిష్యుడికి సమర్థుడైన గురువు లభించినపుడే జీవితానికి సార్థకత కలుగుతుందని, అదేవిధంగా సమర్థుడైన గురువుకి యోగ్యుడైన శిష్యుడు దొరకడమూ అదృష్టమేనని రామకృష్ణ పరమహంస అన్నారు. భగవంతుడు రామకృష్ణుని భావాలను ఆలకించాడన్నట్టు ఆయనకు సరిపడిన వివేకానందుని శిష్యునిగా ప్రసాదించాడు. వివేకానందుడికి గురువు కావడం పరమహంస అదృష్టమైతే, రామకృష్ణ పరమహంసకు శిష్యుడు కావడం వివేకానందుడి పూర్వజన్మ సుకృతం.
‘శ్రోత్రియుడు, పాపరహితుడు, కోర్కెలు లేనివాడు, శ్రేష్ఠుడు, బ్రహ్మనిష్టగలవాడు, నివురుగప్పిన నిప్పులా శాంతంగా మండేవాడు, నిర్వాజ్య దయాసింధువైనవాడే నిజమైన గురువని’ చెప్పిన శంకరాచార్యులవాడి భాష్యం, లోకంలో గురువుల ఎంపికకు మార్గదర్శనం చేస్తుంది. నిజానికి గురువుల్లో ఇలాంటి గొప్పలక్షణాలు వున్నవారు అరుదుగా దర్శనమిస్తారు. కానీ శిష్యులు తమ ప్రయత్నాలను రెట్టించి సమర్థుడైన గురువును కనిపెట్టి శిష్యరికం చేయాలి.
శిష్యుడి మనస్సులో సారం గ్రహంచి తదనుగుణంగా తీర్చిదిద్దాలి గురువు. బలాబలాలు, ఆసక్తులు గ్రహించి ప్రయోజకులను చేయడమే కాకుండా శిష్యుల చెడు తలంపులను నిరోధించడం, శిష్యుడి మనసులో భావాలు అర్థం చేసుకుని సరిదిద్దే సామర్థ్యం గురువులు అలవరచుకుంటే గొప్ప శిష్యులు లోకానికి లభిస్తారు. అర్జునుడి శక్తి సామర్థ్యాలు తెలిసిన ద్రోణుడు ప్రపంచంలో మేటి విలుకాడుగా తీర్చిదిద్దుతానని చేసిన వాగ్దానం నిలపడం కోసం ఏకలవ్యుడి బ్రొటనవేలుని గురుదక్షిణ రూపంలో స్వీకరించిన ఉదంతం భారతం వివరించింది.
చరిత్రలో గొప్ప గురుశిష్యులుగా పేరుపొందిన అరిస్టాటిల్- అలెగ్జాండర్, చాణక్యుడు, చంద్రగుప్తుడు, ఛత్రపతి శివాజీ- సమర్ద రామదాసులను నేటి కాలం గురుశిష్యులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలి.
నేటికాలంలో విద్యార్థులమీద అత్యంత ప్రేమతో ప్రవర్తించి వారి అభ్యున్నతికి శ్రమిస్తూ చిట్టచివరి నిమిషంలోనూ యువతలో స్ఫూర్తి రగిలించినవారు ఉన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు శిష్యుల ప్రేమ సామ్రాజ్యంలో కోటలు నిర్మించుకున్న సంగతి, పుట్టిన రోజునే గురుపూజోత్సవం నిర్వహిస్తున్న విషయం విదితమే. గురుపూజోత్సవాలు ప్రతి ఏడాది జరుగుతాయి. వాటిని మొక్కుబడిగా నిర్వహించడం కాకుండా ఉత్తమస్థాయి శిష్యులను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ప్రయత్నించాలి నేటి గురువులు.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు 83286 42583