Others

ప్రణామాలు.. గురువర్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువర్యా!
బోధి చెట్టులాంటి మీ నీడనే కదా!
జీవిత పాఠాలు నేర్చుకున్నది
మీరు వెలిగించిన అక్షరజ్యోతులే కదా!
బతుకుదారులు చూపిస్తున్నవి
ఉన్నత విలువలు పెంచ
ఎంత ‘తపస్సు’ చేశారో...
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ద
ఎంతగా ‘మేధోమథనం’ గావించారో...
ఎంత జ్ఞానామృతాన్ని ఆర్తిగా
మస్తిష్కంలో నిక్షిప్తం చేశారో...
ఎన్ని జీవన సుద్దులు
ముద్దగజేసి అందించారో...
శిలలం మేమైతే..
శిల్పులు మీరయ్యారు
క్రియలం మేమైతే..
కర్తలు మీరయ్యారు
విరులం మేమైతే..
తోటమాలి మీరయ్యారు
కనుపాపలు మేమైతే..
కంటి రెప్పలు మీరయ్యారు
జీవన చిత్రం మేమైతే..
విలువల వర్ణం మీరయ్యారు
మీరు చూపిన ఆదర్శ పథాన పయనించేము
మీరు ప్రసాదించిన ‘విజ్ఞాన’ పరిమిళం
ఇల పరిచేము

గురువర్యా!
మీకు ఇదే మా ప్రణామం..
మీకు ఇదే మా ప్రణామం..!

సెప్టెంబర్ 5న డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా గురువుల కీర్తిస్తూ...

- కోడిగూటి తిరుపతి, 9573929493