Others

‘్ధమ్రవర్ణు’నికి స్వాగతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీనందనుడు, ఉమాసుతుడు అయన వినాయకుడు గణాలకు అధిపతి. అన్ని విద్యలకు ఆదిదేవుడు. ఏ కళను ఆరాధించేవారైనా వినాయకుడిని పూజిస్తారు. అటువంటి వినాయకుడు నాట్యం చేస్తుంటే, ఆయన మొల నూలి గజ్జెల కదలిక కారణంగా మృదుమధుర సంగీతం వినవస్తోందని ఆయన చేతిలోని తామరతూడు కదలికలు, తాళం వేస్తున్నట్లున్నాయని, అప్పుడే వికసించిన జపా పుష్పంలాగా ఉదయభానుని వలె, గణపతి శరీరం ఉందని, చేతులు పైకెత్తి భ్రుకుటిని కేంద్రీకరించి కనుల పండుగగా నాట్యం చేస్తున్నాడు- ‘నాట్యగణపతి’ అని, ‘భుజంగ ఛందస్సులో, లయకు ప్రాధాన్యతనిస్తూ, ప్రగాఢ భక్త్భివం ఉట్టిపడుతూ వర్ణించారు గణేష భుజంగ స్తోత్రంలో శ్రీ శంకర భగవత్పాదులు వర్ణించారు.
వినాయకుడంటే ప్రకృతికి ప్రతిరూపం. కలిసి మెలిసి జీవించే తత్వానికి సంకేతం. విద్య, విజ్ఞానం అందించే దేవతా స్వరూపం. మెల్లని చూపుల మందహాసంతో ... దీవెనలు అందించే ఏకదంతుడి పూజతో ఎన్నో అంతరార్థాలు. వినాయక చవితివ్రతంలో ఏకవంశతి పత్రపూజ అంటే 21 పత్రాలలో పూజించే విధానం విశిష్టమైనది. ఒక్కొక్క నామాన్ని స్మరిస్తూ ప్రత్యేక పత్రాలతో గణపతిని పూజిస్తారు.
పరబ్రహ్మ స్వరూపుడగు గణపతి సర్వదైత్య సంహారంద్వారా భూభారమును తగ్గించి దేవతలను, ఋషులను, శిష్టులను రక్షించుటకు నాల్గు యుగములలోను నాలుగు రూపాలతో అవతరించాడు. కృతయుగంలో దశభుజ ధారియై, సింహవాహనుడై ‘‘వినాయక’’నామంతో విలసిల్లేడు. త్రేతాయుగంలో శుక్లవర్ణంతో ‘‘మయూరేశ్వర’’నామంతో షడ్భుజోపేతుడై తేజరిల్లేడు. ద్వాపర యుగంలో సింధూరవర్ణంతో నాలుగు చేతులతో మూషక వాహనుడై ‘గజానన’నామంతో గణుతి చెందేడు.
కలియుగంలో భ్రష్టాచారాలు, అసత్యాలు, మితిమీరిపోతాయి ధరిత్రి సస్యహీనమవుతుంది. చెట్లు నిస్సారవౌతాయి. పుణ్యతీర్థాలు గుప్తమవుతాయి. సర్వత్రా అధర్మం పెరిగిపోవుటవలన ధర్మం నామమాత్రమవుతుంది. అధర్మం సర్వత్ర ఏలుబడి సాగిస్తున్నప్పుడు, వేద విహితకర్మలు నిలిచిపోయినపుడు వేరొక దిక్కులేక అపుడు జనులు గజాననుని చేతులెత్తి ప్రార్థిస్తారు. సర్వవిఘ్న వినాశకుడగు వినాయకుడు వారి మొరలాలించి చేటలంతటి చెవులతో ‘‘్ధమ్రవర్ణు’’డను పేరుగలిగి నల్లని గుఱ్ఱమెక్కి చేతిలో కత్తిని ధరించి క్రోధావేశముతోదుష్టులను తన నిజ తేజస్సుతో సంహరించి ధర్మమును పునరుద్ధరిస్తాడు. అప్పుడు సజ్జన పాలన సాగుతుంది. కనుక మనమందరం అనుక్షణమూ జై గణేశ జై జై గణేశ అని వినాయకుని స్మరిద్దాం.

- వాణిమూర్తి