Others

ఎడబాటు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వైవాహిక బంధం’ గురించి ఆలోచించినపుడల్లా అందమైన పాట మదిలో సుడులు తిరుగుతుందెవరికైనా...
‘‘జత బాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా...’’ అంటూ సాగే ఆ చరణం మనసుని మధురోహల్లోకి లాక్కెళ్ళిపోతుంది. కౌగిల్లోకి గాలి సైతం చొరబడకుండా దాంపత్య సౌఖ్యాన్ని అనుభవించాలని ఆ కవి అంటుంటే-
నేటి తరం జంటలు మాత్రం ‘పర్సనల్ స్పేస్’ కావాలంటున్నారు. ఇప్పుడిది విడాకులకి ప్రధానాంశమై కోర్టుమెట్లెక్కిస్తున్నాయి. కోర్టు కేసుల్లో అధిక శాతం ఇదే అంశంపై విడాకులు కోరుతున్నారని పరిశీలకులంటున్నారు.
‘‘నేను కనబడకపోతే మావారు ఒక్క క్షణం కూడా ఉండలేరు’’అని ఒకప్పుడు ‘‘స్ర్తి’’ సగర్వంగా చెప్పుకొనేది. నేటి యువతులు అలా అనడం లేదు. ఇరవై నాలుగు గంటలూ నాకు కాపలా ఏంటి? ఊపిరి ఆడనట్లుంటుంది. ‘‘కాస్త నామానాన నన్ను వదిలేయవచ్చుగా’’అంటున్నారు. స్ర్తిలే కాదు పురుషులదీ అదే మాట. ‘వాళ్ళమ్మ గారింటికి, స్నేహితులు, బంధువులందరి ఇంటికి నన్ను రమ్మంటుంది. తాను వెళ్ళి నన్ను వదిలేస్తే నా స్నేహితులతో కాసేపైనా ఫ్రీగా గడుపుతాను’ కదా అంటారు.
నిపుణులేమంటారంటే... ఏ కాంతంగా గడిపే కొంత సమయం- అది పొద్దునే్న నిద్రలేవగానే కావచ్చు. సాయంత్రం ఆఫీసునుంచి రాగానే కావచ్చు. ప్రశాంతంగా గడిపే ఆ సమయంలో వ్యక్తి తనలోకి తాను చూసుకోవడం సాధ్యమవుతుంది. దురదృష్టవశాత్తు స్వార్థమయ ప్రపంచంలో ఎవరూ బంధం పటిష్టంగా ఉండటానికి తానేం చేశానని ఆలోచించడం లేదు. ఈ బంధం తనకేమిచ్చిందని ఆలోచిస్తున్నారు. అవే గొడవలు.
నా స్పేస్ నాకివ్వు. నీకు మాత్రం అలా ఇవ్వను- అంటే గొడవే కదా మరి. చాలా సందర్భాల్లో ఇద్దరూ బిజీగా ఉండి కలసి ఎక్కువ సమయం గడవకపోవడంవల్లే ఈ సమస్య తలెత్తుతున్నదని పరిశీలకుల అంచనా. అసలు కారణాన్ని వదిలి ఎదుటివారిని నిష్టూరమాడడానికే ఈ స్పేస్‌ని సాకుగా చూపుతుంటారు. ‘పాశ్చాత్య ప్రభావమే ఇదంతా’అని కొట్టిపడేసేవారికి వీళ్ళేం సమాధానం చెపుతారు?
‘‘స్పేస్’’అన్న పదాన్ని సాధారణంగా వాడకపోవచ్చు. కానీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ భావనని గుర్తిస్తున్నారు.
‘స్పేస్’అన్నది ఒక బంధంలో ఉన్న ఇద్దరూ వ్యక్తులుగా ఎదగడానికి ఉపయోగపడాలి. అంతేగానీ నాది...నీది... అంటూ ఒకరినొకరు దూరంగా పారిపోవడం కాదు. ఒక బంధంలో స్పేస్ అనేది నీది...నాది... మనది... అని మూడు విధాలుగా ఉంటుంది. స్ర్తిఅయినా, పురుషుడైనా తనకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవడానికి, తప్పుచేసిన భావం కలగకుండా కాస్త స్వేచ్ఛగా కోరుకున్న విధంగా గడపడానికి ఒంటరిగా బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళడానికి... స్వేచ్ఛ ఉండటమే ‘‘స్పేస్’’.
మన సమాజంలో సాధారణంగా ఏం జరుగుతుందంటే పురుషుల స్పేస్‌కి లభించి ప్రాధాన్యం స్ర్తిలకు లభించదు. భర్త, పిల్లలు, ఇల్లు...ఇలా అన్నీ కలిపి ఆమె స్వేచ్ఛను హరిస్తాయి.
ఆమె ఎప్పుడయినా నోరు తెరచి విసుగు వ్యక్తంచేస్తే మంచి ఇల్లాలు కాదని, బొత్తిగా ఓపిక లేదని, మంచిచెడులు తెలియవని వ్యాఖ్యానిస్తారు.
కానీ, పరిస్థితి అలానే కొనసాగితే నిస్పృహ పేరుకుపోయి వివాహబంధంలో అకస్మాత్తుగా సంక్షోభం తలెత్తుతుంది. దీన్ని గుర్తించి పురుషులు జీవిత భాగస్వామికి స్వేచ్ఛనిస్తే అంతా సఖమయమే. అలాగే స్ర్తి తన భర్తను అనుమానించకుండా తనకు ఇవ్వవలసిన విలువలనిస్తే ఏ గొడవ రాదు. భాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్ధంచేసుకుని ‘‘స్వేచ్ఛ’’ఇచ్చి పుచ్చుకున్నప్పుడే ‘స్పేస్’కు నిజమైన అర్ధం ఉంటుంది. ఇద్దరి మనసుల్లో ఆలోచనలు, అభిరుచులూ కలసినపుడే అది ‘‘కామన్ స్పేస్’’ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా పెంచి పోషించుకుంటే వీరిమధ్య సమస్యలే రావు.
వ్యక్తిగత స్పేస్‌కోసం కామన్‌స్పేస్‌ని త్యాగం చేస్తే బంధం బలహీనపడుతుంది. నేటి యాంత్రిక ప్రపంచంలో ఈ స్పేస్‌ను కామన్‌గా కాపాడుకోవడంకోసం కామన్ సెన్సుతో ఆలోచించడం అవసరం. అప్పుడే భార్యాభర్తల మధ్య ‘ఎడబాటు’అనేది దరిదాపుల్లోకి రాదు. దీంతో బంధం బలపడి, సుఖశాంతులతో గడపగలుగుతారు.

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660