Others

జీవన శిల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ జీవన శిల్పానికి
నీవే ఒక శిల్పివై
మార్చుకొనుము - కూర్చుకొనుము
నవ జీవన విధానమును..!
పొద్దుపొడుపు పొడవగనే
బద్ధకాన్ని వదిలిపెట్టి
నిదురలేచి నిశ్చయముగ
నడకను ప్రారంభించుము
అల్పాహారము తోనే
ఆ రోజును మొదలుపెట్టి
అంతులేని ఆరోగ్యం-
పొందు మింక ప్రతిరోజూ!
యోగా - ధ్యానము విడిచి
సాగదు మన జీవనమ్ము
ఆత్మశుద్ధి పొందుటకై
ఆధ్యాత్మికతను నమ్ము!
తెలుసా? మన జీవిత నౌక
తెరచాపలు లేని నావ..
మనసు దారి తప్పినచో
మరచిపోవుదాని త్రోవ!
కలగానిది జీవితమని
కవి చెప్పిన మాట విని
కష్టించుము - సృష్టించుము
కమనీయమగు - జీవన శిల్పమును
కృషి చేయుము - శృతి చేయుము
శ్రమ జీవన సౌందర్యమును!

-మరువాడ భానుమూర్తి