Others

‘శతపత్ర’ రచయతకు శత జయంతి ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నూరేళ్ళలో గడియారం రామకృష్ణశర్మగారి వంటి సాహిత్య యోద్ధ మరొకరు ఏరీ? ఆయన జీవిత గాథ రమ్యాతిరమ్యం. తెలుగు భాషా సాహిత్యాభిమానులకు కనువిందు అక్షరమైన పసందు. వారి స్వీయ చరిత్ర పేరు ‘శత పత్రము’.
నిజంగానే అది నూరు రేకుల జీవన జల జాతం. ఈ నూరేళ్ళలో మనమెరిగిన కవులు, పండితులు, సాహిత్యవేత్తలు, మనస్వులు, అక్షర సంపన్నులు ఎందరో ఉండవచ్చు. కాని రామకృష్ణశర్మ ఆయనకు ఆయనే సాటి. ఉత్తమ శ్లోకులలో మేటి! వీరి జీవిత గాథలో కన్పించే అత్యుత్కంఠ భరితమైన సాహిత్య, సామాజిక, సంఘ సంస్కరణ, స్వాతంత్య్రోద్యమ విప్లవ సంఘటనలు, సన్నివేశాలు మరెవరి స్వీయ చరిత్ర, ఆత్మకథ, అనుభవాలు జ్ఞాపకాలలో కన్పించే అవకాశం మృగ్యం. వీరి ధిషణ అహంసంకలితం కాదు. స్వార్థపంకిలం అసలే కాదు. అష్టాదశ శక్తిపీఠాలలో ప్రసిద్ధమైన అలంపురం జోగులాంబ ఈయన సేవలను కోరి కోరి నియోగించుకున్నట్లనిపిస్తుంది వీరిని. వీరు ధర్మకర్తల పాలక మండలి అధ్యక్షులు అయ్యే సమయానికి మూడు లక్షల అప్పు ఉండేది. వీరాస్థానం నుంచి నివృత్తులయ్యే నాటికి 30 లక్షల ఆస్తులు, నిత్యసేవా కైంకర్యాల ఉత్సాహాతిశయాలు తల్లికి నివేదితమైనాయి. రామకృష్ణశర్మగారు కవి, పండితుడు, పరిశోధకుడు, చరిత్రవేత్త, దేవాలయ శిల్పవిజ్ఞాత, శాసనవేత్త, వాస్తుమేధానిధి, తాళపత్ర హృదయావిష్కర్త, స్వాతంత్య్రోద్యమ సమర సేనాని, జీవిత చరిత్రకారుడు, ప్రాచీన లిపి, పురా చారిత్రకాధార సంపన్నుడు, దేవాలయ పరిరక్షకుడు, ఇన్ని విశేషణాలు ఎన్నదగినవారు ఇంకొకరున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాచీన వారసత్వ కట్టడ, ఆలయ శాఖల మంత్రిగా జగమోహన్ ఉన్నప్పుడు అలంపురం జోగులాంబ దేవాలయానికి రెండు కోట్ల ద్రవ్యం మంజూరైనప్పుడు, దేవాలయాన్ని బహుముఖీన సుందర విరాజితంగా దిద్దితీర్చిన కృషి యజ్ఞంలో ఆర్తిజ్వం శర్మగారిదే. ఆంధ్ర (ఇప్పుడు తెలంగాణ) సారస్వత పరిషత్తు నిర్మాతలలో ప్రథమగణ్యులు శర్మగారు. అలంపురం వంటి పల్లెలో సకలాంధ్ర కవిసమ్మేళనం నిర్వహించిన వారాయన. సర్వేపల్లి రాధాకృష్ణను ఈ సభలకు ముఖ్యఅతిథిగా రప్పించినవారు శర్మగారే. శ్రీశ్రీనుంచి శ్రీపాదకృష్ణమూర్తి శాస్ర్తీగారి వరకు ఈ సాహిత్యసత్రంలో భజించినవారే, భుజించినవారే. 1950లలోనే ‘సుజాత’వంటి పత్రికను కొన్ని సంవత్సరాలు నడిపారు. మొగమాటం అనే మాట తెలియని నిష్కపటి. ఎంతవారినైనా ఎదుర్కొనగలిగిన ధీరుడు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డివారికి మనీషుల మిత్రరత్నం. గడియారంవారి శత జయంతి సందర్భంగా ఇటీవల వారి నివాళి రచనలు కొన్ని వచ్చి ఉండవచ్చు. కాని గడియారంవారు పేలూరి శివరామశాస్ర్తీగారి వద్ద సాహిత్య పరిశ్రమ చేశారని ప్రస్తావించి ఉండరు.
విజయవాడ రైల్వే ప్లాట్‌ఫారం మీద గిడుగువారి దర్శనమైందని వారి మెడలో బాకా వంటి సాధనం వేలాడుతుండేదనీ, ఈ చిన్న బాకా మూతి దగ్గర ఇతరులు తమ మూతిపెట్టి సంభాషించాలని శర్మగారు చెప్పారు. ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ హైదరాబాదు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో స్వాతంత్య్ర భానూదయ అణియాలు చెప్పారనీ తమను తోడేళ్ళపాలు చేశారని విషాద్రోద్తిక్తులైనారని శర్మ రాశారు. బీజాపూర్ సుల్తాన్ తెలుగు సనదు గూర్చి చెప్పారు. స్థానికంగా తురకల ఆగడాలను హుంకరించి నిలిపివేశారు. స్వాతంత్య్ర సమరంలో అజ్ఞాత రేడియో నిర్వహించి జయప్రకాశ్ పక్షాన ఉన్నారు. ఆయన శత జయంతి కనీసం నూరుచోట్ల జరుపుకోవద్దా?!

చిత్రం... గడియారం రామకృష్ణశర్మ

- అక్కిరాజు రమాపతిరావు