Others

బాంధవ్యానికి ప్రతిరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘యేన బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబద్నామి రక్షే మా చల మా చల...’’ ఓ రక్షా బంధమా! మహా బలవంతుడూ, రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని బంధించావు...కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను... సోదర ప్రేమకు ప్రతిరూపంగా రక్షాబంధనాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం భారతావనిలో అనాదిగా ఆచరణలో ఉన్న సత్సంప్రదాయం. మహావిష్ణువు, మహాబలి కోరిక మేరకు ఆయనతో పాతాళంలో ఉండిపోతారు. దేవతల కోరిక మేరకు మహాలక్ష్మి, పాతాళానికి వెళ్ళి, బలిరాజుకు రక్షాబంధనం గావించి, బలి ఇచ్చిన వరంతో తిరిగి వైకుంఠ నాథుని తీసుకు వెళుతుంది. ఇతిహాసాధారంగా శిశుపాలుని సంహరించే సమయాన సుదర్శన చక్ర ప్రయోగంలో శ్రీకృష్ణునికి చూపుడు వేలు రక్తసిక్తమవుతుంది. వెంటనే ద్రౌపది తన పట్టుచీర కొంగును చించి, ఆ వేలుకు కడుతుంది. దానికి కృతజ్ఞతగా గోపాలుడు, ద్రుపద రాజ తనయకు అన్ని వేళలా అండగా ఉంటానని మాట ఇచ్చి, దుశ్శాసనుడు వలువలు వొలిచే సమయాన పంచభర్తృకకు రక్షణగా ఉంటారు. భవిష్యత్ పురాణాధారంగా పూర్వం దేవతలకు, దానవులకు యుద్ధం జరగగా, ఓడిపోయిన దేవేంద్రుడు నిర్వీర్యుడై, పరివార సహితంగా అమరావతిలో తల దాచుకుంటాడు. చింతాక్రాంతుడైన స్వర్గ్ధాపతి దీనస్థితిని గాంచి, ఇంద్రాణి తరుణోపాయం యోచించి, రాక్షస రాజు అమరావతిని ఆక్రమించకుండా, దేవేంద్రునికి పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి, రక్షను కట్టి, దేవేంద్రుని సమరోత్సాహ భరితుని గావిస్తుంది. దీనితో ఇంద్రుడు యుద్ధంలో గెలుపొంది, త్రైలోక్య ఆధిపత్యం పొందుతాడు. జగజ్జేతగా నిలవాలనే పట్టుదలతో దేశాలను జయిస్తూ, చరిత్రలో క్రీ.పూ.326లో అలెగ్జాండర్ భారత దేశ దండ్రయాత్ర గావిస్తాడు. ఈ క్రమంలో అలెగ్జాండర్ బాక్ట్రియా (నేటి అఫ్ఘనిస్థాన్)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహమాడతాడు. ఈ వివాహ బంధాన్ని వినియోగించుకుని, ఆయన మధ్య ఆసియా దేశాలను, ప్రధానంగా జీలం, చీనాబ్‌ల మధ్య రాజ్యాలను జయించ ముందుకు సాగుతాడు. తక్షశిల రాజు పురుశోత్తముని శతృవు అంబి, అలెగ్జాండరును భారతదేశంలోనికి ఆహ్వానిస్తాడు. పురుశోత్తముడు యుద్ధానికి సర్వసన్నద్ధమవుతాడు. అలెగ్జాండర్ భార్య రోక్సానా, తక్షశిల రాజు పురుశోత్తముని సోదరునిగా భావించి, రాఖీ కడుతుంది. తన సోదరుని చంపొద్దని, భర్తను కోరుతుంది. ఫలితంగా అలెగ్జాండర్ యుద్ధ విరమణ గావిస్తాడు. మొఘల్ చక్రవర్తి హుమాయూన్, చిత్తోరుఘడ్‌పై ఆక్రమణ చేసిన సమయంలో రాణా సతీమణి విధవ కర్మవతి, హుమాయూన్‌కు రక్షను పంపి, తన కోరికను తెలియ జేసిన క్రమంలో మొఘల్ చక్రవర్తి, మాట ఇస్తూ, బహదూర్‌షాతో యుద్ధం చేసి, రక్షించినట్లు కథనాలు. ఇలా పూర్వకాలం నుండి భాతృ ప్రేమకు, అనురాగాలకు, రక్షణకు ప్రతీకగా రక్షాబంధనానికి ప్రత్యేకత ఉంది.
‘హయగ్రీవ జయంతి’గా, ‘జంధ్యాల’, ‘రాఖీ’, ‘నార్లీ’ పూర్ణిమగా పేరెన్నిక గన్న శ్రావణ పౌర్ణమి సర్వజనులకు పర్వదినం. ఉపవాసాలకు ఉద్దిష్టమైన పండుగ కాక, హిందువులలో అన్ని తరగతుల వారూ నిర్వహించుకునే పర్వం ఇది. వర్షాకాలపు రాకకు సంతసిస్తూ, మధుర పదార్థాలు భుజించడం అనుసరణీయమైన ఆచారం. పూర్వకాలంలో శ్రావణ పూర్ణిమనాడు ఉపాకర్మానంతరం వేదవిద్య ప్రారంభించడం జరిగేది. ఉపాకర్మ పండుగకాక అధ్యయయానికి సంబంధించిన కర్మ. ఉప నయనమనగా అదనపు కన్ను. గురువు తన ప్రజ్ఞాప్రాభవముల చేత వటువునకు జ్ఞాన నేత్రమును తెరిపించడమన్నది పరమార్థం. యజ్ఞం, ఉపవీతంతో కలిస్తే యజ్ఞోపవీతం. ఉప వీతమంటే దారము. యాగకర్మచేత పునీతమైన మూడు పోచల దారం. సృష్టి, స్థితి, లయకారులైన త్రిమూర్తులను సూచించేవి ఒక్కో ముడిలోని మూడు తాళ్ళు.
ప్రాశస్త్యం
సర్వరోగ ఉపశమనం, సర్వాశుభ వినాశనం కోసం ధర్మజుడు శ్రీకృష్ణుడిని ఉపాయం అడుగగా, రక్షాబంధన విధి ఉపదేశించినట్లు, దేవాసుర యుద్ధంలో ఇంద్రునికి ఇంద్రాణి రక్షాబంధంనం చేసి, విజయం సాధింప చేసినట్లు శ్రీకృష్ణుడు వివరించిన సందర్భం పురాణ కథనం. రక్షాబంధనం భార్య, భర్తకు కట్టాలని ఉన్నా, ఆచరణలో సోదరియో, కూతురో కట్టే ఆచారాన్ని వ్రతోత్సవ చంద్రిక వివరిస్తుంది. శ్రావణ పౌర్ణిమనే రాఖీ పూర్ణిమ. రాఖీ అంటే తోరము. తోరం పట్టుదారముతో లేదా నూలుదారంతో చేయబడుతుంది. రాఖీ అనేది ఒక ఆభరణం లాంటిది. రంగుదారంతో లేదా కాగితంతో చేసి, దానికి తోరం జోడించి, దానిని సోదరి సోదరుని ముంజేతికి కట్టడం సాంప్రదాయం. బొట్టుపెట్టి హారతినివ్వడం, సోదరుడు, సోదరికి కట్నకానుకలు సమర్పించడం ఆచారం. రాఖీ ప్రాధన్యతను బట్టే ఒక స్ర్తి, పురుషునికి రాఖీ పంపి లేదా కట్టి ఆతని రక్ష కోరే ఆచారం ఏర్పడింది. దానిని అందుకోవడం తోనే ఆతడు ఆమెకు సోదరుడై రక్షకుడవుతాడని భావన.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494