Others

మాంగల్యబలం దేనికీ సాటిరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవదానవులకు జరిగిన యుద్ధంలో, దేవతల్లో చాలామంది మరణించుట వలన , రాక్షసుల బలం పెరుగుట దానివలన వీరికి ఇబ్బందులు ఎదురవడం వల్ల ఇంద్రాదులు బ్రహ్మవెంట శ్రీహరిని శరణువేడిరి. నారాయణుడు ప్రత్యక్షమై పాలసముద్రము మధించిన అమృతము లభించుననియు దానిని సేవించిన మరణము కలుగదని వారికి అభయం ఇచ్చాడు. దేవదానవులు మంధర పర్వతమును కవ్వంగా వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసుకొని, క్షీరసాగరాన్ని మధించారు. పర్వతము నీట మునుగు చుండ శ్రీహరి కూర్మావతారము దాల్చి తన వీపున ధరించి పాలసముద్రము చిలకడానికి తోడ్పడ్డాడు. ముందుగా పాలకడలి నుండి, భయోత్పాతము కలిగించుచున్న హాలహాలము ఉద్భవించి, అగ్ని జ్వాలలు వెదజల్లి లోకాలను దహించసాగింది.
దేవతాగణములు భీతచిత్తులై ప్రాణకోటిని కాపాడుమని పరమేశ్వరుని ప్రార్థించారు. దయాసముద్రుడగు రుద్రుడు, వారికి అభయం ఇచ్చాడు. తానే నిలబడి హాలహాల భక్షణకై సిద్ధపడి పార్వతి అంగీకారము కొరకై ఆమె వైపు త్రినేత్రుడు చూశాడు.
జగన్మాత ఉమాదేవి తన మాంగల్య ప్రభావమును స్మరించి, లోక రక్షణార్థం విషము భక్షించుటకై తన క్రీగంట చూపుతూనే తన అంగీకారము తెల్పిందట ఆ తల్లి.
మహాభాగవత పురాణంలో పరీక్షిత్ మహారాజు శుక మహర్షి చెప్పుచుండగా ఈ సంఘటన విని, మునీశ్వరా! లోక సంరక్షణకై అగ్ని జ్వాలలు గ్రక్కుచూ విస్తరించుచున్న ఆ మహావిషమును తన భర్త భక్షించుటకై ఎట్లు అంగీకరించినది? అత్యంత ప్రమాదకరమైన ఆ భీకర దావాగ్ని జ్వాలలనూ ప్రత్యక్షంగా కట్టెదుట చూచికూడా, తన భర్తకు యేమగునో యని ఏమాత్రభయపడకుండా, సంకోచించకుండా జాప్యములేకుండా మహావిషము భక్షించుమని కంటిచూపుతోనే తన అంగీకారము ఆ తల్లి ఎట్లు తెలియ చేసినదో వివరించుమని ప్రశ్నించాడు. అమాట విన్న శుక మహర్షి
రాజా!
మ్రింగెడు వాడు విభుండని
మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వ మంగళ
మంగళ సూత్రంబు నెంత మదినమ్మినదో
అని సందేహ నివృత్తి గావించాడు.
సనాతన హైందవ సంస్కృతీ సంప్రదాయములలో వేద సమ్మతమైన, వైవాహిక క్రతువు, మాంగళ్య ధారణా ప్రభావము, ప్రామాణికమైన సముజ్వల ఘట్టము. వరుడు ముందుగా సంకల్ప సహితముగా మాంగళ్య అధిష్టాన దేవతలను, సగౌరవముగా ఆహ్వానించి షోడశోపచారములతో శాస్త్రోక్తంగా మాంగల్యమును పూజించుట జరుగుతుంది. మాంగల్యమును పచ్చి టెంకాయ పై నుంచి పూజించిన పిమ్మట ఆహ్వానితులగు బ్రాహ్మణుల చేతను, ముతె్తైదువుల చేతను స్పృశించబడిన పిమ్మట ‘‘మాంగళ్యం తంతునానేన...’’ అనే మంత్రము ఉచ్చరిస్తూ వధువు మెడలో మూడు ముళ్లు వేయడం జరుగుతుంది. అనగా నా జీవనమునకు హేతువైన ఈ సూత్రం చేత నేను నీకంఠమునందు మంగళసూత్రమును కట్టుచున్నాను. నీవు నూరు సంవత్సరములు జీవింతువు గాక అని దీని భావం. వేదార్థ సమన్వితమగు మాంగళ్య ధారణతో వివాహ ప్రక్రియలో ప్రధాన ఘట్టం ముగుస్తుంది.
కానీ నేడు చాలామంది ఈ అత్యున్నతమైన మాంగళ్యధారణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పాశ్చాత్య పోకడలకు వెళ్లి ప్రపంచంలోనే అత్యున్నతమైన కుటుంబ వ్యవస్థ, వైవాహిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం అంతమంచి పనికాదు. కనుక దీనిని గూర్చి నేటి యువతులు దీర్ఘంగా ఆలోచించాల్సిన తరుణం ఉంది.
ప్రాచీనులైన మహాపతివ్రతలుగా వాసికెక్కిన అనసూయ, సావిత్రి, లోపాముద్ర మున్నగు ఋషిపత్నులు మాంగళ్య ప్రభావము వలననే సూర్యగమనమును కూడా నిరోధించే శక్తిని కలిగి ఉండిరి. అంతేకాక కరువుకాటకములువచ్చినపుడు వారి మాంగళ్య శక్తితోనే గంగాదిపుణ్యనదులను మళ్లించి దేశమును సస్యశ్యామలమును చేసిన వారై నేటికీ అందరిచేత పూజించబడుతున్నారు. అత్రి మహాముని భార్య తన పాతివ్రత్య మహిమ వల్లనే త్రిమూర్తులను కూడా పసిపాపలుగా చేసిన కథ మనం వింటూనే ఉన్నాము. కనుక ఇప్పటి భారత నారీమణులందరూ వైవాహిక వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను కాపాడ వలసిన అవసరం ఎంతైనా ఉంది.

- ఆర్. రామారావు.. 9492191360