Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. బాల్యమును హరియించుచుఁ బనియు ఁ గట్టు
కునియు బాలలఁ గానె్వంట్ల గోడలందు
నకట! బందీ ఁ జేతురీనాడు గాంచ ఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం:నేటి కాలంలో తల్లిదండ్రులు పిల్లల బాల్యాన్ని హరిస్తూ పని గట్టుకుని మరీ కానె్వంట్ల గోడల మధ్య బంధీలను చేసేస్తున్నారు కదా. వారికి ఆటపాటలయందు కాస్తంతైనా ఆసక్తి జనించకుండా కేవలం చదువులను నూరిపోస్తున్నారు. దానివల్ల వారి లోకధర్మాన్ని తెలుసుకోలేని వారవుతున్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య.
తే.గీ. సశేషాల పిచ్చిన ఁ బడి టీవి ముందుఁ
గూలఁబడి రెప్పవాల్చక కొలిదియైనఁ
దమ కుటుంబ సభ్యుల ఁ గూర్చి తలపఁ బోరె
చూడుమా కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ మధ్య టీవీలో వచ్చేసీరియళ్లను చూడడమనే పిచ్చిలో పడి తమ కుటుంబ సభ్యులను గూర్చి కొద్దిగా కూడా పట్టించుకోవడం మానేస్తున్నారు చాలామంది. ఆ ధ్యాసలో పడి తిండి నిద్ర మరిచి ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకుంటున్నారు. మానసికారోగ్యమూ చెడగొట్టుకుంటున్నారు. అయ్యో వీరేమి మనుష్యులు? కర్మసాక్షివైన ఓ సూర్యదేవ చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262