Others

రసాయనాలను కనిపెడదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం తినే ఆహారం మంచిదా? కాదా? తెలియదు.. దాన్ని ఎక్కడ పండించారో? తెలియదు.. అందులో ఎన్ని రసాయనాలు ఉన్నాయో? తెలియదు. కనీసం అది తింటే ఏమవుతుంది? అది కూడా తెలియదు. ఇన్ని సందేహాలు మెదడులో ఉంచుకుని.. సందేహపడుతూ ఆహారాన్ని తినాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం నేడు. గ్రీన్‌టెస్ట్ పరికరం మన చేతిలో ఉంటే ఇకనుంచి ఇలా సందేహపడుతూ ఆహారాన్ని తినాల్సిన పనిలేదు. ఈ పరికరాన్ని ఉపయోగించడం కూడా తేలికే.. అరచేతిలో ఇమిడిపోయే ఈ పరికరంతో పండ్లు, కాయగూరలు, మాంసం వంటి వాటిల్లోని నైట్రేట్లు, చుట్టూ ఉన్న పరిసరాల నుంచి వచ్చి చేరిన రసాయనాల శాతాన్ని పరీక్షించవచ్చు. ఈ పరికరంతో పరీక్షించాలనుకున్న కాయగూరని గుచ్చితే చాలు.. పరికరం తెర ఎరుపు, పసుపు, పచ్చరంగుల్లోకి మారిపోతుంది. ఎరుపులో ఉంటే నైట్రేట్ల శాతం ఎక్కువగా ఉన్నట్లు.. పసుపులో ఉంటే ఆలోచించాల్సి ఉంటుంది.. పచ్చ రంగులో ఉంటే ఆ కాయగూరను నిరభ్యంతరంగా వండుకుని తినేసేయొచ్చు. చాలాబాగుంది కదూ ఈ పరికరం. ఇంకెందుకాలస్యం ఇలాంటి పరికరాన్ని తెచ్చుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని సొంతం చేసుకోండి.