Others
గూటికి చేరే ముందు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 May 2019
- గవిడి శ్రీనివాస్, 9966550601
ఇన్ని రోజులు గడిచాక
నెమ్మది నెమ్మదిగా చూపుల్ని నెడుతూ
ఒంటరి ఇల్లును వదిలి
స్వస్థలం చేరుకోడానికి ఆరుబయట ఊగే గాలిలా
మనసు నిలకడగా లేదు
చుట్టూ చూస్తున్నాను
ఆదరించే ప్రపంచం నెలకొని ఉంది
ఒకచోట ఉండాలనే ఉంటుంది
వీచే గాలులు ఉరిమే ఉరుములు
ఏవీ నాలో నన్ను ఆట్టే ఉండనీయవు
ఏదో ముందుకు లాగినట్టు
గెలుపేదో ఒక మార్గం నిర్దేశిస్తున్నట్టు
కాలాన్ని ఆనుకొని స్థలాలు మారతాం
నా వాకిలి రోడ్డును చూస్తూ
నా పెరటి చెట్టును ఆస్వాదిస్తూ
కాసిన్ని అడుగుల్ని ముందుకు నడిపాను
నాలాగే దూరం వచ్చి
సొంతూరు పోవాల్సినవారు కలిశారు
జీవితమూ మనసూ మారలేదు
కాస్త ఆర్థిక ప్రమాణాలు తప్ప.
ఇప్పుడొకటనిపిస్తుంది
ఉదయం ఎగిరి పిట్టలు చెట్టునొదిలి ఉండలేవు
మళ్లీ గూటికి
అలసి సాయంకాలం వాలింది